ETV Bharat / bharat

పార్లమెంట్​ వద్ద హైఅలర్ట్​- ముట్టడికి పిలుపునిచ్చిన నిషిద్ధ ఉగ్ర సంస్థ! - ఖలిస్థాన్

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ 'సిఖ్​ ఫర్​ జస్టిస్' పార్లమెంట్​ (Sikh for Justice) ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైఅలర్ట్​ను ప్రకటించారు అధికారులు. పార్లమెంట్​పై ఖలిస్థానీ జెండా ఎగురవేసిన వారికి రూ.93.78 లక్షలు బహుమానంగా ఇస్తామంటూ సిఖ్​ ఫర్​ జస్టిస్​ వీడియో సందేశంలో పేర్కొంది.

parliament
పార్లమెంట్​ వద్ద హైఅలర్ట్​
author img

By

Published : Nov 29, 2021, 12:20 PM IST

Sikh for Justice: పార్లమెంట్​ వద్ద నిఘా సంస్థలు హైఅలర్ట్​ ప్రకటించాయి. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ 'సిఖ్​ ఫర్​ జస్టిస్' (ఎస్​ఎఫ్​జే) ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. శీతాకాల సమావేశాల సందర్భంగా సిఖ్​ ఫర్​ జస్టిస్​ పార్లమెంట్​ ముట్టడి చేయాలని, రైతులంతా పార్లమెంట్​ ప్రాంగణంలో నిరసన తెలపాలని కోరుతూ వీడియో విడుదల చేసింది.

జెండా ఎగురువేసిన వారికి రివార్డ్​

పార్లమెంట్​పైన ఖలిస్థానీ జెండా ఎగురవేసే వారికి సిఖ్​ ఫర్​ జస్టిస్​ రివార్డు ప్రకటించింది. 'ఈ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎవరైతే పార్లమెంట్​పై ఖలిస్థానీ జెండా ఎగురవేస్తారో వారికి రూ.93.78 లక్షలు బహుమానంగా ఇస్తాం' అని ఎస్​ఎఫ్​జే ప్రధాన కార్యదర్శి గురుపత్వంత్​ పన్ను ప్రకటనలో పేర్కొన్నాడు.

సోమవారం ప్రారంభమైన పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబరు 23 వరకు కొనసాగుతాయి.

ఇదీ చూడండి : ఎన్​సీపీ మహిళా ఎంపీతో స్టెప్పులేసి అలరించిన శివసేన ఎంపీ రౌత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.