ETV Bharat / bharat

అప్పుడు కుస్తీ.. ఇప్పుడు దోస్తీ: బాబాయ్‌ పార్టీతో పొత్తుకు అఖిలేశ్‌ రెడీ - ప్రగతిశీల సమాజ్​వాదీ పార్టీ లోహియా

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేసిన సమాజ్​ వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ (akhilesh yadav news) మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బాబాయ్​ శివపాల్​ యాదవ్​ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

akhilesh-yadav
బాబాయ్‌ పార్టీతో పొత్తుకు అఖిలేశ్‌ రెడీ
author img

By

Published : Nov 4, 2021, 8:52 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(UP assembly polls) బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌(akhilesh yadav news) ప్రకటించారు. ఆయనకు పూర్తి గౌరవం ఇస్తామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో(up polls 2022) చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పార్టీతో కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు.

అఖిలేశ్‌ యాదవ్‌తో(akhilesh yadav news) విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకొచ్చిన శివపాల్‌ యాదవ్‌ గతేడాది ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఇటీవల ఓ సందర్భంలో ఆయన సైతం ఎస్పీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గతంలో బాబాయ్‌- అబ్బాయ్‌ మధ్యనున్న నెలకొన్న వైరుధ్యాన్ని ఎన్నికల వేళ పక్కన పెట్టడం గమనార్హం.

మరోవైపు వల్లభ్​భాయ్‌ పటేల్‌తో జిన్నాను పోల్చుతూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డిమాండ్‌పైనా అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. ఏ చిన్న విషయాన్నైనా రాజకీయం చేయాలనే దృష్టితో భాజపా చూస్తుందని, అభివృద్ధి, ఉద్యోగం గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడదని పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాని గురించి మాట్లాడాలని సూచించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో " సర్దార్‌ పటేల్, మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులయ్యారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. పోరాటానికి వారు ఎన్నడూ వెనకడుగు వేయలేదు" అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. జిన్నాను పటేల్‌తో పోల్చడంపై భాజపా మండిపడింది.

ఇదీ చూడండి: యూపీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: అఖిలేశ్ యాదవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.