ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(Uttarakhand Election 2022) సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav News Today) అక్టోబర్ 12 నుంచి 'సమాజ్‌వాదీ విజయ్ యాత్ర' ప్రారంభించనున్నారు. 2001లో 'క్రాంతి రథ యాత్ర'(Kranti Rath Yatra) అనంతరం 2002లో, 2011 యాత్రల అనంతరం ఎస్పీ అధికారం చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుత 'యాత్ర' దోహదపడుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంగా తన రాజకీయ జీవితంలో మూడోసారి పార్టీ యాత్రను ప్రారంభించనున్నారు అఖిలేశ్. ఆయన యాత్ర చేసిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిందని.. ఈసారీ అదృష్టం కలిసొస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. '2011 యాత్ర తర్వాత ఎస్పీ అధికారంలోకి వచ్చింది. అఖిలేశ్ మొదటిసారి ముఖ్యమంత్రి(UP Former CM) అయ్యారు. ఈసారి కూడా మేము తిరిగి అధికారం చేపడతాం' అని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు.
"భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ, అవినీతి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి, నిజమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే 'విజయ యాత్ర' లక్ష్యం."
-రాజేంద్ర చౌదరి, ఎస్పీ అధికార ప్రతినిధి
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల(UP Assembly Election 2022) వరకు రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. లఖ్‌నవూ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మొదటి సమావేశం ఉన్నావ్‌లో జరగనున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఇవీ చదవండి: