ETV Bharat / bharat

జైలు నుంచి అసెంబ్లీకి.. అచ్చం సినిమాలానే... - అసోం ఎమ్మెల్యే

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలతో అరెస్టైన అసోం ఎమ్మెల్యే అఖిల్​ గొగొయి నిర్దేషిగా విడుదలయ్యారు. గొగొయిపై ఉన్న రెండు కేసులను కొట్టివేసింది ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో ముగ్గురికి విముక్తి లభించింది.

Akhil Gogoi
అఖిల్​ గొగొయీ
author img

By

Published : Jul 1, 2021, 2:11 PM IST

Updated : Jul 1, 2021, 4:22 PM IST

అసోం రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే, రైజోర్​ దళ్​ పార్టీ అధినేత.. అఖిల్​ గొగొయి జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు. 2019, డిసెంబర్​లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉందన్న అభియోగాలను కొట్టివేసింది ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు. అఖిల్​తో పాటు ఆయన ముగ్గురు సహాయకులకు విముక్తి లభించింది.

2019 డిసెంబర్​లో సీఏఏ నిరసనల నేపథ్యంలో వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967(యూఏపీఏ) కింద రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. తొలుత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చంద్​మారి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. అందులో జూన్​ 22నే వారికి విముక్తి లభించింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న ఆరోపణలతో చబౌ పోలీస్​ స్టేషన్​లో నమోదైన మరో కేసులో గురువారం విచారణ చేపట్టిన ఎన్​ఐఏ ప్రత్యేక జడ్జి ప్రంజల్​ దాస్​.. కేసును కొట్టివేశారు.

కొద్దిరోజులుగా అఖిల్ గువాహటి వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు రిలీజ్​ ఆదేశాలు గువాహటి జైలు అధికారులకు అందిన క్రమంలో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయన ముగ్గురు సహాయకులు ఇప్పటికే బెయిల్​పై విడుదలయ్యారు.

Akhil Gogoi
మీడియాతో మాట్లాడుతున్న అఖిల్​ గొగొయి

"చివరకు నిజం బయటపడింది. జైలులో పెట్టాలనే ఏ ప్రయత్నమూ ఫలించలేదని స్పష్టమవుతోంది. ఇంటికి వెళ్లిన తర్వాత సీఏఏ వ్యతిరేక అల్లర్లలో అమరుడైన సామ్​ స్టాఫోర్డ్​ తల్లిదండ్రులను కలుస్తాను. అక్కడి నుంచి క్రిషక్​ ముక్తి సంగ్రామ్​ సమితి, రైజోర్​ దళ్​ కార్యాలయాను సందర్శిస్తాను. శుక్రవారం ఉదయం నా నియోజకవర్గం శివసాగర్​లో పర్యటిస్తా. నేను జైలులో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచి గెలిపించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. "

- అఖిల్​ గొగొయి, ఎమ్మెల్యే.

జైలు నుంచే ఎమ్మెల్యేగా..

సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘటనలపై దేశద్రోహం అభియోగాలతో ఎన్​ఐఏ అరెస్ట్​ చేసిన క్రమంలో.. సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైజోర్‌ దళ్‌ పార్టీ తరఫున అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు గొగొయి. జైల్లో ఉండటం వల్ల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. బహిరంగ లేఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు తన వాణిని వినిపించారు. ప్రజా సమస్యలనూ ప్రస్తావించారు. తన ప్రత్యర్థి, భాజపాకు చెందిన సురభి రాజ్​కోన్​వారిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఇదీ చూడండి: చేతిలో డబ్బు లేకున్నా ఎన్నికల బరిలోకి గొగొయ్​

Last Updated : Jul 1, 2021, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.