ETV Bharat / bharat

5లక్షల ఏకే-203 రైఫిల్స్​ తయారీకి భారత్​ గ్రీన్​ సిగ్నల్​ - ఏకే 203 రైఫిల్స్​

Ak 203 rifle Indian army: 5లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్స్​ తయారీకి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో వీటిని తయారు చేయనున్నారు.

ak 203 rifle indian army
ఏకే 203 రైఫిల్స్​
author img

By

Published : Dec 4, 2021, 11:40 AM IST

Ak 203 rifle news: రక్షణ విభాగంలో స్వయం సమృద్ధివైపు మరో అడుగు వేసింది భారత్​. 5లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్స్​ తయారీ కోసం రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రైఫిల్స్​ను ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలోని కోర్వాలో తయారు చేయనున్నారు.

భారత డిఫెన్స్​ సామాగ్రి తయారీ హబ్​గా ఉత్తర్​ప్రదేశ్​ అవతరించనుందని కేంద్ర వర్గాలు అభిప్రాయపడ్డాయి. కొనుగోళ్ల నుంచి 'మేక్​ ఇన్​ ఇండియా' స్థాయికి భారత్​ చేరుతోందని పేర్కొన్నాయి. రష్యా భాగస్వామ్యంతో ఈ రైఫిల్స్​ను తయారు చేయనున్నట్టు, ఫలితంగా ఇరు దేశాల బంధం మరింత బలపడనుందని వెల్లడించాయి. ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ఈ ప్రాజెక్టుతో వ్యాపార, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపాయి.

మూడు దశాబ్దాలుగా వినియోగిస్తున్న ఐఎన్​ఎస్​ఏఎస్​ రైఫిల్స్​ స్థానంలో ఈ 7.62X 39ఎమ్​ఎమ్​ కాలిబర్​ ఏకే-203 తుపాకులు అందుబాటులోకి రానున్నాయి. వీటితో సైనికులకు అదనపు శక్తి లభిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:- INS vela submarine: నావికాదళ అమ్ములపొదిలో ఐఎన్​ఎస్​ 'వేలా'యుధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.