ED summons Aishwarya Rai: పనామా పత్రాల వ్యవహారంలో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు సోమవారం హాజరయ్యారు. పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ఐశ్వర్యను ప్రశ్నించేందుకు నోటీసులు ఇవ్వగా.. సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు.
4 గంటలకుపైగా..
సుమారు 4 గంటలకుపైగా ఐశ్వర్యను ప్రశ్నించారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దిల్లీ జామ్‌నగర్‌లోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రాగా.. సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు వచ్చారు ఐశ్వర్య.
గతంలో సమన్లు ఇచ్చినప్పుడు సమయం కోరిన ఐశ్వర్యరాయ్ సోమవారం కూడా హజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా దిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో ఉంది. ఆ పత్రాల్లో ఐశ్వర్య సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశాలకు పంపిన ధనం వివరాలు తెలిపాలని గత నోటీసుల్లోనే ఈడీ పేర్కొంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వివరాలను ఐశ్వర్య రాయ్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఈడీ విచారణకు బాలీవుడ్ నటి- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?