ETV Bharat / bharat

Airtel: మొబైల్‌+ డీటీహెచ్‌+ ఫైబర్‌.. ఒకే ప్లాన్‌లో అన్నీ! - ఎయిర్‌టెల్ న్యూ ప్లాన్స్ డిటేయిల్స్

మొబైల్, డీటీహెచ్, ఫైబర్(ఇంటర్​నెట్) సేవలన్నీ ఒకే గొడుగు కింద అందించనున్నట్లు టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్ ప్రకటించింది. 'ఎయిర్​టెల్ బ్లాక్ ఆల్ ఇన్ వన్' పేరిట ప్రారంభించిన ఈ సేవల్లో ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి మరి..

Airtel
ఎయిర్​టెల్
author img

By

Published : Jul 2, 2021, 8:59 PM IST

Updated : Jul 2, 2021, 9:28 PM IST

దేశంలోనే తొలిసారిగా గృహ అవసరాల కోసం 'ఎయిర్‌టెల్ బ్లాక్' పేరిట వివిధ సేవలను ఒకే గొడుగు కింద అందించనున్నట్లు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఒకే ప్లాన్​లో ఫైబర్‌, డీటీహెచ్‌,మొబైల్​కు సంబంధించిన సేవలు అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. ఈ మేరకు తమ వినియోగదారులు ఒకే బిల్లుతో ఈ మూడింట్లో ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలను పొందవచ్చని వెల్లడించింది. ఈ సేవలకు జీవితకాల ఉచిత సర్వీస్​తో పాటు.. ఇన్​స్టాలేషన్​ ఛార్జీలు సైతం ఉండవని తెలిపింది. ఒకే బిల్లు సేవల ద్వారా.. నెల తిరిగేసరికి వివిధ చెల్లింపుల ఇబ్బంది తప్పుతుందని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది.

ప్రత్యేక సేవలు..

'ఎయిర్​టెల్ బ్లాక్' యూజర్లకు నిరంతరాయ సేవలందించేందుకు రిలేషన్​షిప్​ మేనేజర్లను నియమించనుంది సంస్థ. వీరు అంకితభావంతో పనిచేస్తూ.. వినియోగదారులకు తలెత్తే సమస్యలను కస్టమర్లు కాల్ చేసిన 60 సెకన్లలోపే వేగంగా పరిష్కరిస్తారని పేర్కొంది. ఈ సేవలన్నీ ఉచితమేనంది.

'ఎయిర్‌టెల్ బ్లాక్' ప్లాన్స్ వివరాలు..

ప్లాన్స్సేవలు
రూ.9982 మొబైల్​ కనెక్షన్లు+1 డీటీహెచ్
రూ.13983 మొబైల్ కనెక్షన్లు + 1 డీటీహెచ్
రూ.15982 మొబైల్ కనెక్షన్లు + 1 ఫైబర్ కనెక్షన్
రూ.20993 మొబైల్ కనెక్షన్లు + 1 డీటీహెచ్ + 1 ఫైబర్ కనెక్షన్

అదనపు ప్రయోజనాలు..

  • 'ఎయిర్​టెల్ బ్లాక్' కస్టమర్లకు ఫైబర్ ప్లాన్స్ రూ.499 నుంచి ప్రారంభమవుతాయి. 1Gbps వేగంతో.. అపరిమిత డేటా ల్యాండ్‌లైన్ కనెక్షన్ సదుపాయం ఉంటుంది.
  • రూ.499 నుంచి ప్రారంభమయ్యే మొబైల్ యూజర్ల ప్లాన్స్​లో.. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, 210జీబీ డేటా వంటివి అందిస్తోంది.
  • డీటీహెచ్ బేసిక్ ప్లాన్ రూ.153 నుంచి ప్రారంభం. రీఛార్జిపై ఫ్లాట్ రూ.465 తగ్గింపుతో పాటు.. అదనంగా హెచ్‌డీ బాక్స్, ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఉచితం.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్​, ఎయిర్‌టెల్ స్టోర్, లేదా.. 8826655555 నెంబర్​కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎయిర్​టెల్ బ్లాక్ సేవలను పొందొచ్చని సంస్థ తెలిపింది.

ఇవీ చదవండి: ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ షురూ.!

2020-21లో ఎయిర్​టెల్ నష్టం రూ.15,084 కోట్లు

ఎయిర్​టెల్​కే అధికంగా కొత్త యూజర్లు!

Last Updated : Jul 2, 2021, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.