ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న 'మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్' విమానాశ్రయ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2022 జనవరి కల్లా పూర్తి చేసి విమాన సేవలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
విమానాశ్రయం కోసం 555.6 ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1001.77కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు రూ.947.91 కోట్లు విడుదల చేసింది. వాటితో పాటు అదనంగా 2020-21 ఏడాదికి గాను రూ.10కోట్లు మంజూరు చేసింది. విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే భారత విమాన ప్రాధికార సంస్థ వద్ద 377 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాంతీయ అనుసంధాన పథకంలో భాగంగా మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమాశ్రయానికి రూ.250కోట్లు కేటాయించింది కేంద్రం.
ఇదీ చూడండి: అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు