ETV Bharat / bharat

ఒవైసీపై హత్యాయత్నం కేసులో 398 పేజీల ఛార్జ్​షీట్​

Asaduddin Owaisi News: ఫిబ్రవరి 3న ఉత్తర్​ప్రదేశ్​ హాపుఢ్​లో ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీపై హత్యాయత్నం కేసుకు సంబంధించి ఛార్జ్​షీట్ దాఖలు చేశారు పోలీసులు. మొత్తం 398 పేజీల అభియోగపత్రాన్ని నిందితులపై మోపారు. ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటనలో ఆగంతుకులు ఒవైసీ కారుపై తుపాకులతో కాల్పులు జరిపారు.

asaduddin-owaisi-attack-case
ఒవైసీపై హత్యాయత్నం కేసులో 398 పేజీలీ ఛార్జ్​షీట్​
author img

By

Published : Apr 13, 2022, 3:06 PM IST

Asaduddin Owaisi Attack case: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్ర దుమారం రేపిన అసదుద్ధీన్ ఒవైసీపై దాడి కేేసుకు సంబంధించి పోలీసులు 398 పేజీల ఛార్జ్​షీట్ దాఖలు చేశారు. నిందితులు సచిన్​, శుభంపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మొత్తం 60మందిని ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నారు.

మే 3న యూపీ హాపుఢ్​లోని పిల్​ఖువా పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్నికల ప్రచారం ముగించుకుని మేరఠ్​ నుంచి దిల్లీ వెళ్తుండగా.. టోల్​ప్లాజా వద్ద నిందితులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన ఆలిమ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు 24 గంటలపాటు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. వారు కేసుకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించారు.

ఇదీ చదవండి: అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.