ETV Bharat / bharat

'టీకాల పనితీరుకు యాంటీబాడీలే ప్రామాణికం కాదు'

వ్యాక్సిన్​ల పనితీరును తెలిపేందుకు యాంటీబాడీల ఉత్పత్తి ఒక్కటే ప్రామాణికం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. భారత్​లో లభ్యమయ్యే టీకాలు వైరస్​పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్నారు.

AIIMS Director guleria
గులేరియా
author img

By

Published : Jun 9, 2021, 5:27 AM IST

Updated : Jun 9, 2021, 6:47 AM IST

టీకాల పనితీరును చాటిచెప్పడానికి యాంటీబాడీల ఉత్పత్తి ఒక్కటే ప్రామాణికం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. దీన్నిబట్టి టీకా పనితీరును అంచనా వేయడానికి వీల్లేదన్నారు. భారత్‌లో లభ్యమవుతున్న వ్యాక్సిన్లన్నీ ఇంతవరకు దేశంలో కనిపించిన వైరస్‌ రకాలపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

"టీకాలు పలు రకాలుగా రక్షణ కల్పిస్తాయి. యాంటీబాడీలు, సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ మెమొరీసెల్స్‌ (కణ ప్రమేయంతో పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ) ద్వారా రక్షణ ఇస్తాయి. వైరస్‌ సోకినప్పుడు అధిక యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ టీకాల సామర్థ్యం దాదాపు ఒకేలా ఉంది. అందువల్ల ప్రజలు తమకు ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. దానివల్ల వారికే కాకుండా, వారి కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది"

- రణ్‌దీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌

గర్భిణులకు త్వరలో టీకా అందుబాటులోకి వస్తుందని గులేరియా చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు ఈ టీకాలను ప్రారంభించినట్లు తెలిపారు. "ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లను గర్భిణులకు ఇవ్వడానికి యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ డేటా ఇప్పటికే కొంత అందుబాటులో ఉంది. త్వరలో పూర్తిస్థాయి డేటా అందుబాటులోకి వస్తుంది" అని వివరించారు. పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చని పునరుద్ఘాటించారు. కొవిడ్‌ వచ్చిపోయిన వారు కోలుకున్న రోజు నుంచి 3 నెలల తర్వాత వ్యాక్సిన్‌ తీసుకుంటే బలమైన రోగ నిరోధకశక్తి ఏర్పడుతుందన్నారు.

యాంటీబాడీ పరీక్షల అవసరం లేదు

"వ్యాక్సినేషన్‌ తర్వాత కొందరు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నారు. దాని అవసరం ఏమీలేదు. ఎందుకంటే వ్యక్తి రోగనిరోధశక్తిని యాంటీబాడీలు మాత్రమే ప్రతిబింబించవు. అందుకు కారణం టీ-సెల్స్‌, మొమొరీ సెల్స్‌లో వచ్చే మార్పులే. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వీటిలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అవి బలోపేతంగా తయారై రోగనిరోధ శక్తిని పెంచుకుంటాయి. టీ సెల్స్‌ యాంటీబాడీ టెస్టుల్లో కనిపించవు. అవి ఎముకమజ్జ (బోన్‌ మ్యారో)లోనే ఉంటాయి."

-- వీకే పాల్, నీతిఆయోగ్ సభ్యుడు

ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు..

వ్యాక్సిన్లు తీసుకుంటే కొన్ని వారాల తర్వాత రోగ నిరోధకశక్తి తగ్గిపోయి చనిపోతారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని గులేరియా, వీకేపాల్‌ పిలుపునిచ్చారు. కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అన్నది భారత్‌లో చాలా అరుదని, ఎవ్వరూ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. గుర్తించదగ్గ స్థాయిలో అలర్జీ సమస్యలున్న వారు డాక్టర్ల సలహాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని పాల్‌ సూచించారు.

సాధారణ జలుబు, చర్మ సంబంధ అలర్జీలున్నవారు ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అలర్జీలకు మందులు తీసుకుంటున్నవారు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతా వాటిని కొనసాగించవచ్చని గులేరియా వివరించారు.

ఇదీ చదవండి : పిల్లల్లో కొవిడ్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా?

Last Updated : Jun 9, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.