ETV Bharat / bharat

'వ్యాక్సినేషన్​లో ప్రైవేట్ సంస్థల​ సహకారం అవసరం'

author img

By

Published : Feb 20, 2021, 9:03 PM IST

దేశంలో కొవిడ్​ టీకా అందరికీ చేరాలంటే ప్రభుత్వ, ప్రైవేట్​ భాగస్వామ్యం(పీపీపీ) విధానం అవసరమవుతుందని ఎయిమ్స్​ డైరెక్టర్​ డా.రణ్​దీప్​ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు తగ్గుతుండడం.. అవకాశాలకు అందివచ్చిన మార్గం అని పేర్కొన్నారు.

aiims chief doctor randeep guleria
'వ్యాక్సినేషన్​లో పీపీపీ విధానాన్ని పాటించాలి'

దేశంలో కరోనా కేసులు తగ్గటం.. అవకాశాల కోసం తెరచుకున్న కిటీకీ అని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​(ఎయిమ్స్​) డెరెక్టర్​ డా.రణ్​దీప్​ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియ పెద్ద స్థాయిలో కొనసాగడానికి పబ్లిక్​, ప్రైవేట్​ భాగస్వామ్యం(పీపీపీ) ఉండాలని అన్నారు. దిల్లీలో జరిగిన ఏఐఎంఏ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు వ్యాక్సిన్​ ఒక్కటే ప్రధాన ఆయుధమని తెలిపారు.

"కేసులు తగ్గుతున్నందున అవకాశాల కిటీకీ తెరుచుకుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కానీ, ఈ కిటీకీ ఎప్పుడైనా మూసుకుపోవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రపంచ దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కొత్త రకం కరోనా వైరస్​తో దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనం ఇప్పుడు ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. దేశ పౌరులందరికీ పెద్ద సంఖ్యలో టీకా పంపిణీ చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే కొవిడ్​ నుంచి మనకు కాస్తయినా రక్షణ లభిస్తుంది. టీకా అందరికీ చేరాలంటే పబ్లిక్​, ప్రైవేట్​ భాగస్వామ్య పద్ధతిని అభివృద్ధి చేయాలి."

-డా.రణ్​దీప్​ గులేరియా, ఎయిమ్స్​ డైరెక్టర్​.

ఆరోగ్య సంరక్షణ రంగాన్ని సేవా రంగంగా మాత్రమే పరిగణించకూడదని గులేరియా అభిప్రాయపడ్డారు. భారత్​ అంటే వైద్య పరిశోధనలకు నిలయంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ రోగుల సంరక్షణ నిలయంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో వైస్​ ఛైర్​పర్సన్​ ప్రీతారెడ్డి పాల్గొన్నారు. కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆమె కొనియాడారు.

ఇదీ చదవండి:'ఈ ఏడాది చివరికి బహిరంగ మార్కెట్లో వ్యాక్సిన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.