AIADMK Quits NDA : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడో కూటమికి నాయకత్వం వహిస్తామని వెల్లడించింది. సోమవారం చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తెలిపారు. ఇప్పటి నుంచి బీజేపీ, NDA కూటమితో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంటోందని చెప్పారు. బీజేపీ తమిళనాడు నాయకత్వం గతేడాది నుంచి తమ మాజీ నేతలు, జనరల్ సెక్రటరీ, కేడర్‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. చెన్నైలో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు పళనిస్వామి అధ్యక్షత వహించగా.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
-
#WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj
— ANI (@ANI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj
— ANI (@ANI) September 25, 2023#WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj
— ANI (@ANI) September 25, 2023
గత కొంత కాలంగా తమిళనాడులోని బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగాయి. దిల్లీ బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా సమస్య పరిష్కారమైనట్టు కనిపించేది. అయితే, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడాన్ని, ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడాన్ని, దివంగత సీఎం అన్నాదురైపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అన్నాడీఎంకే నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు.
ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, దిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే, అన్నామలై తీరుపై దిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే.. వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే, బీజేపీతో కూటమి వల్లే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిందన్న అభిప్రాయం ఉండటం.. సీట్ల కేటాయింపు అంశంలో పొసగకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నా డీఎంకే తాజా నిర్ణయం తీసుకుంది.
'ఆయన యాచించినా చేర్చుకోం'.. నీతీశ్ వ్యాఖ్యపై బీజేపీ కౌంటర్
మరోవైపు.. ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరేదిలేదని స్పష్టం చేశారు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను.. ఎన్డీఏ కూటమిలో చేరికపై మీడియా ప్రశ్నించగా.. ఆ వార్తలను కొట్టిపారేశారు.
నీతీశ్ కుమార్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది బీజేపీ. ఆయన యాచించినా సరే.. తిరిగి కూటమిలోకి చేర్చుకోమని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ.. నీతీశ్‌పై విరుచుకుపడ్డారు.
JDS Joins NDA Alliance Party : NDAలోకి జేడీఎస్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ
INDIA vs NDA Bypoll 2023 : ఇండియా X ఎన్డీఏ.. ఫస్ట్ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి?