నగరంలో వైరస్ కట్టడి, టీకా పంపిణీ వేగాన్ని పెంచేందుకు గుజరాత్ అహ్మదాబాద్(ahmedabad vaccine news today) యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా ఒక్క డోసు కూడా తీసుకోని వారికి సోమవారం నుంచి ప్రజా రవాణా వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది(gujarat vaccination status).
ఈ విషయంపై ప్రజలకు కొన్ని రోజుల ముందే సంకేతాలందాయి. వ్యాక్సిన్ తీసుకోని ప్రజలను.. ప్రజా రవాణాతో పాటు కంకరియా లేఖ్ఫ్రంట్, సబర్మతి రివర్‌ఫ్రంట్, లైబ్రరీలు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లోకి అనుమతించమని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ముఖేశ్ కుమార్ వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లోని ఎంట్రీ పాయింట్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే లోపలకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా లెక్కల ప్రకారం.. గుజరాత్‌వ్యాప్తంగా 5,67,04,892మంది రెండు డోసులు తీసుకున్నారు. కాగా.. మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 4కోట్ల కన్నా ఎక్కువగా ఉంది.
ఆదివారం.. గుజరాత్లో కొవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది(gujarat cases of coronavirus). కేవలం 8 కేసులే బయటపడ్డాయి. ఇంతటి తక్కువ స్థాయిలో కేసులు నమోదవడం 2021లో ఇదే తొలిసారి. రాష్ట్రంలో 8,25,723 వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 10,082మంది వైరస్‌కు బలయ్యారు. కాగా.. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. రికవరీల సంఖ్య 8,15,505గా ఉంది.
జోరు...
ఈ నెల 17న.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భాజపా కార్యకర్తలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో టీకా డ్రైవ్ నిర్వహించారు. ఫలితంగా దేశంలో ఒక్కరోజులో 2.25కోట్ల టీకాలను పంపిణీ చేశారు(gujarat vaccination data). ఒక్క గుజరాత్‌లోనే 22.1లక్షల డోసులు అందించారు. అహ్మదాబాద్‌లో ఆరోజు 2,31,639మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.
ఇవీ చూడండి:-