ETV Bharat / bharat

లెక్కలు తారుమారు- భాజపా బేజారు

'మారుస్తాం.. అన్నీ మారుస్తాం' అంటూ తమిళ ప్రాంతీయ పార్టీల గుండెల్లో తుపాను రేపిన సూపర్​స్టార్​ 'రాజకీయం' మొత్తానికి ఏ అలజడి లేకుండా విశ్రాంతి తీరం చేరింది. రాజకీయాల్లోకి రాకుండానే గుడ్​బై చెప్తూ రజనీ చేసిన సంచలన ప్రకటన అటు అభిమానులతో పాటు భాజపాను తీవ్ర నిరాశకు గురిచేసింది. తమిళనాట తలైవా సాయంతో మొత్తం మార్చేద్దామనుకున్న కమలదళానికి ఊహించని షాక్​ తగిలింది.

author img

By

Published : Dec 30, 2020, 1:05 PM IST

Rajinikanth
తమిళనాట మారిన లెక్కలు

'ఎంత పనిచేశారు తలైవా.. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎంతలా ఎదురుచూశాం.. చివరకు...'

ఇది సూపర్​స్టార్​ రజనీకాంత్​ సగటు అభిమాని బాధ మాత్రమే కాదు. తలైవా సాయంతో తమిళనాట రాజకీయ ప్రభంజనం సృష్టిద్దామనుకున్న భాజపా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఎందుకంటే తమిళనాట దశాబ్దాలుగా డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం), అన్నాడీఎంకే (అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీలదే హవా. అక్కడ జాతీయ పార్టీల ప్రభావం అంతంత మాత్రమే. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ లోటును రజనీకాంత్​ సాయంతో భర్తీ చేద్దామని కమలనాథులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తలైవా ఇచ్చిన షాక్​తో భాజపా అయోమయంలో పడింది.

నేను రాలేను.. క్షమించండి..

అన్నీ సవ్యంగా జరిగితే 2021 జనవరి 17 ఎంజీఆర్​ జయంతిన తమిళనాట మధురైలో రజనీకాంత్ పార్టీ ప్రకటించేవారని సమాచారం. కానీ ఆయన​ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తమిళనాట ఎన్నికల లెక్కలు తారుమారయ్యాయి.

"ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల వల్ల పార్టీ పెట్టే ఆలోచనలను విరమించుకున్నాను. నా కోసం అభిమానుల్ని రాజకీయాలకు బలిపశువుల్ని చేయలేను. మీకు బాధ కలిగిస్తున్నందుకు.. క్షమించండి. ఇది అంత సులువు కాదు.. కానీ తప్పదు."

- రజనీకాంత్​, సినీనటుడు

రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకేసారి భాజపాకు నిరాశను.. అన్నాడీఎంకే, డీఎంకేకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఎందుకంటే కమల దళ వ్యూహాలు, లెక్కల్ని తలైవా నిర్ణయం తలకిందులు చేసింది. రజనీ అనూహ్య నిర్ణయాన్ని ద్రవిడ పార్టీలు మాత్రం స్వాగతించాయి.

భాజపా భారీ ఆశలు..

రజనీకాంత్​ రాజకీయ పార్టీపై అభిమానుల కంటే భాజపానే భారీ ఆశలు పెట్టుకుందని నిపుణులు అంటున్నారు. తలైవా ప్రజాకర్షణ శక్తి సాయంతో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాలని కమలదళం భావించిందని విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడు అంచనాలు తారుమారయ్యాయి. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్​ దీనిపై స్పందించేందుకు కూడా నిరాకరించారు. కేంద్ర సహాయమంత్రి పొన్​ రాధాకృష్ణ రజనీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"అనుమానమే లేదు. కచ్చితంగా రజనీకాంత్​ నిర్ణయం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ, ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలని భాజపా కోరుకుంటూనే ఉంటుంది."

- పొన్​ రాధాకృష్ణ, కేంద్ర సహాయ మంత్రి

రజనీ నిర్ణయం భాజపాకు ప్రతికూలంగా మారుతుందా అన్న ప్రశ్నకు రాధాకృష్ణ అలాంటిదేం లేదని బదులిచ్చారు. పైకి అలా చెబుతున్నా.. భాజపాపై రజనీ నిర్ణయం భారీగానే ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు.

ఉత్సాహంగా విపక్షాలు..

భాజపా విషయం పక్కన పెడితే తలైవా ఎగ్జిట్ ప్రతిపక్ష డీఎంకే సహా మిత్రపక్షాలు కాంగ్రెస్​, వామపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుత అన్నాడీఎంకే పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకత తమకే లాభం చేకూరుస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

రజనీకాంత్​ను రాజకీయ పార్టీ పెట్టాలని భాజపా ఒత్తిడి తెచ్చిందని మొదటి నుంచి డీఎంకే ఆరోపిస్తోంది. అమిత్​ షా రాష్ట్రానికి వచ్చి వెళ్లిన 2 వారాల్లోనే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని రజనీకాంత్​ ప్రకటించడాన్ని ఇందుకు కారణంగా చెప్తోంది.

"దివంగత జయలలిత, కరుణానిధి లేని ఆ లోటును ప్రజాకర్షణ ఉన్న రజనీకాంత్​తో భర్తీ చేయాలని భాజపా యోచించింది. తద్వారా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లొచ్చని అంచనా వేసింది. అయితే అది బెడిసికొట్టింది."

-ఆజీ శెంతిల్​నాథన్​, రాజకీయ విశ్లేషకుడు

అధికారాన్ని చేజిక్కించుకునేంత స్థాయిలో రజనీకాంత్​ లేకున్నా డీఎంకే గెలుపోటములపై ఆయన పార్టీ ప్రభావం ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు.

అన్నాడీఎంకేకు కలిసొచ్చింది..

రజనీకాంత్​ సాయంతో అన్నాడీఎంకేను శాసిద్దామనుకున్న భాజపా మరో ప్రణాళిక కూడా నీరుగారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్​డీఏకు అన్నాడీఏంకే నేతృత్వం వహిస్తోంది. రజనీకాంత్​ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను చూపి సీట్ల పంపకాల్లో భాజపా బెట్టు చేసే అవకాశం ఉండేది. ఒకానొక సమయంలో చిన్నాచితకా పార్టీలతో కలిసి భాజపా.. రజనీకాంత్​తో మూడో ఫ్రంట్​ ఏర్పాటు చేయాలని యోచించినట్లు సమాచారం.

రజనీకాంత్​ సాయంతో అన్నాడీఎంకేను దారికి తెచ్చుకునే అవకాశం భాజపా ఇప్పుడు కోల్పోయింది. భాజపా చేసిన సంకీర్ణ ప్రభుత్వ డిమాండ్​ను అన్నాడీఎంకే తిరస్కరించడం కూడా ఊహించినదే. ఎన్నికలకు 6 నెలలు కూడా లేని ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్​ సాయంతో అన్నాడీఏంకేపై పెత్తనం చెలాయిద్దామనుకున్న భాజపా వ్యూహంఘోరంగా విఫలమైంది.

- డా. సీ లక్ష్మణన్​, మద్రాస్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డెవలప్​మెంట్​ స్టడీస్​లో ఆచార్యులు

మరి తలైవా ఇచ్చిన షాక్​తో కోలుకొని 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.