ETV Bharat / bharat

'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం' - rahul tractor rally

దేశంలో భరత మాతకు చెందిన వ్యాపారం ఏదైనా ఉందంటే.. అది కేవలం వ్యవసాయ రంగం మాత్రమే అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మిగతావన్నీఒకరిద్దరు వ్యాపారులకే పరిమితమైనవని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌లో పర్యటిస్తున్న రాహుల్ రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.

Agriculture is the only business that belongs to "Bharat Mata": Rahul Gandhi
'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం'
author img

By

Published : Feb 22, 2021, 5:31 PM IST

వ్యవసాయమే భారత దేశానికి ప్రధాన వ్యాపారం అని కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా కేరళలోని వయనాడ్​లో ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

దేశ రాజధానిలో అన్నదాతలు పడ్డ కష్టాలను ప్రపంచం మొత్తం చూసిందన్న రాహుల్.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు పడుతోన్న ఇబ్బందులపై ప్రముఖులందరూ స్పందిస్తున్నా.. మోదీ సర్కార్​కు మాత్రం చీమ కుట్టునట్లైనా లేదన్నారు.

"భారత దేశంలో వ్యవసాయరంగాన్ని నాశనం చేసేందుకు మోదీ పావులు కదుపుతున్నారు. తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు లబ్ధి చేకూర్చడానికే సాగు చట్టాలను తీసుకువచ్చారు. వ్యవసాయంపై సుమారు రూ. 40 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతోంది. ఇది ప్రతీ భారతీయునికి చెందింది. అలాంటిది కేవలం కొంతమంది చేతుల్లోకి వెళ్లడం అనేది తప్పు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఆ సమయంలో అండగా నిలిచింది ఆ పథకమే..

2014లో ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎగతాళి చేసినా.. కరోనా సమయంలో లక్షలాది మందికి జీవనాధారంగా నిలిచిందని రాహుల్ అన్నారు. తరువాత కాలంలో మోదీనే ఈ పథకాన్ని కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. యూపీఏ హయాం నాటి జాతీయ ఉపాధి హామీ పథకం వ్యర్థమంటూ మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మోదీ సర్కారు లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు కట్టబెడుతుంటే, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: మే 15న రాహుల్​ పరువు నష్టం కేసు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.