ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకునేలా కొత్తరకం బంగాళాదుంప, అరటి వంగడాలను అభివృద్ధి చేస్తోంది త్రిపుర వ్యవసాయ పరిశోధన కేంద్రం. వైరస్లు, చీడపీడలను తట్టుకుని, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరగటం వీటి ప్రత్యేకత. సుమారు 22వేల(ఆలు, సబ్రి కలిపి) వంగడాలను అభివృద్ధి చేస్తూ.. ఆ రాష్ట్రంలో వ్యవసాయ భవిష్యత్‌ను ఆశాజనకంగా మారుస్తున్నారు.
వ్యవసాయ రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిపై మరిన్ని పరిశోధనలు సాగిస్తున్నట్లు తెలిపారు నిపుణులు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యతను వ్యవసాయ అధికారిని ఝర్నా దత్తా చూసుకుంటున్నారు.
"మొదటి ఏడాదిలో విత్తనాలు నాటేందుకు కావాల్సిన సామగ్రిని అభివృద్ధి చేయాలి. మరుసటి సంవత్సరం పంట మల్టిప్లికేషన్ కోసం ఇక్కడకు తీసుకువస్తాం. మూడో సంవత్సరం పంట క్రాసింగ్ చేపడతాం."
- ఝర్నా దత్తా, వ్యవసాయ అధికారిని
స్థానిక మార్కెట్లో సబ్రికి అధిక డిమాండ్ ఉన్నందున.. ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుందని ఆమె చెప్పారు. ఈ పంటల ద్వారా ఉపాధి కల్పనకూ ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఆదర్శ రైతన్న- వర్షపు నీటి కోసం 6కోట్ల లీటర్ల కుంట