అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు. సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్ సర్టిఫికెట్ ఎందుకని ప్రశ్నించారు. అగ్నిపథ్ నియామకాల్లో కులం, మతానికి సంబంధించి ధ్రువపత్రం అడగడంపై ప్రతిపక్షాలు ఈ విధంగా స్పందించాయి.
-
सेना में किसी भी तरह का कोई आरक्षण नहीं है पर अग्निपथ की भर्तियों में जाति प्रमाण पत्र मांगा जा रहा है।
— Varun Gandhi (@varungandhi80) July 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
क्या अब हम जाति देख कर किसी की राष्ट्रभक्ति तय करेंगे?
सेना की स्थापित परंपराओं को बदलने से हमारी राष्ट्रीय सुरक्षा पर जो प्रभाव पड़ेगा उसके बारे में सरकार को सोचना चाहिए। pic.twitter.com/vHWSpurtZT
">सेना में किसी भी तरह का कोई आरक्षण नहीं है पर अग्निपथ की भर्तियों में जाति प्रमाण पत्र मांगा जा रहा है।
— Varun Gandhi (@varungandhi80) July 19, 2022
क्या अब हम जाति देख कर किसी की राष्ट्रभक्ति तय करेंगे?
सेना की स्थापित परंपराओं को बदलने से हमारी राष्ट्रीय सुरक्षा पर जो प्रभाव पड़ेगा उसके बारे में सरकार को सोचना चाहिए। pic.twitter.com/vHWSpurtZTसेना में किसी भी तरह का कोई आरक्षण नहीं है पर अग्निपथ की भर्तियों में जाति प्रमाण पत्र मांगा जा रहा है।
— Varun Gandhi (@varungandhi80) July 19, 2022
क्या अब हम जाति देख कर किसी की राष्ट्रभक्ति तय करेंगे?
सेना की स्थापित परंपराओं को बदलने से हमारी राष्ट्रीय सुरक्षा पर जो प्रभाव पड़ेगा उसके बारे में सरकार को सोचना चाहिए। pic.twitter.com/vHWSpurtZT
భాజపా ఎంపీ వరణ్ గాంధీ కూడా కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కులాల ద్వారానే వ్యక్తుల దేశభక్తి గుర్తిస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "చరిత్రలో తొలిసారిగా సైనిక నియామకాల్లో కుల, మతాల గురించి ప్రస్తావన వచ్చింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు మోదీ సైన్యంలో అవకాశం ఇవ్వరా? మోదీ ప్రభుత్వం అసలు రూపం ఇప్పుడు బయటపడింది. మోదీ జీ మీరు అగ్నివీరులను చేస్తారా లేక జాతివీరులనా?" అని ట్వీట్ చేశారు.
కేంద్రం క్లారిటీ..: ఈ విషయంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇవన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. ఈ సైనిక నియామక ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతోందని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.
మరోవైపు భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. నియామక ప్రక్రియపై వస్తున్న విమర్శలు సైన్యాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. యువతను నిరసనలకు దిగేలా రెచ్చగొట్టేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి : ధరల పెంపుపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు రేపటికి వాయిదా