ETV Bharat / bharat

'కాశీ, మథుర మేల్కొంటున్నాయి.. మనం ముందడుగు వేయాలి' - జ్ఞాన్​వాపి వివాదం

Kashi Waking up Adityanath: జ్ఞానవాపి మసీదు విషయంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోందని అన్నారు. మథుర, బృందావనం వంటి పలు తీర్థక్షేత్రాలు సైతం మేల్కొంటున్నట్లు పేర్కొన్నారు.

Kashi, Mathura waking up Adityanath
Kashi, Mathura waking up Adityanath
author img

By

Published : May 29, 2022, 5:49 PM IST

Adityanath on Kashi Mathura: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర, బృందావనం, విద్యావాసినీ ధామ్, నైమిశ్ ధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. లఖ్​నవూలో భాజపా నిర్వహించిన ఒకరోజు రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడిన యోగి.. యూపీలో మతపరమైన అల్లర్లు జరగలేదని చెప్పారు.

"రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగాయి. మొదటిసారి రంజాన్‌ సందర్భంగా చివరి శుక్రవారం రోడ్లపై నమాజు జరగలేదు. అనవసర శబ్దం నుంచి ఎలా విముక్తి కల్పించామో (మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించడంపై) మీరు గమనించాలి. కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్​ను ప్రారంభించుకున్నాం. లక్ష మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోంది. మథుర, బృందావనం వంటి తీర్థక్షేత్రాలు మేల్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా మరోసారి ముందడుగు వేయాలి."
-యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి

2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాల్లో 75 స్థానాలు గెలిచేలా భాజపా శ్రేణులు పని చేయాలని యోగి పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఇందుకోసం సన్నద్ధమవ్వాలని సూచించారు. 'ప్రజల ఆశిర్వాదం, కరోనా సమయంలో మనం పడ్డ కష్టానికి అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం. మోదీ నాయకత్వంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి. 75 సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలి' అని యోగి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.