Afghanistan Embassy Shut Down : భారత్‌లో అక్టోబర్ 1 నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం. భారత్ తమ దేశం పట్ల ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలున్నాయన్న అఫ్గానిస్థాన్.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొన్నామని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వివిధ కోణాల్లో ఆలోచించే భారత్‌లో మా దౌత్యపరమైన కార్యకలాపాలు నిలిపివేసినట్లు వివరించింది. అందుకు తామెంతో చింతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
"వివిధ కారణాలతో తమ రాయబార కార్యాలయంలో సిబ్బందిని, ఇతర వనరులను భారత్ తగ్గించింంది. వనరుల లేమితో కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో మార్గం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం." అఫ్గాన్ ఆరోపించింది. అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు అఫ్గాన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయన అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
-
#WATCH | The Embassy of Afghanistan in New Delhi will cease operations from today, October 1; outside visuals from the Embassy https://t.co/btVHVLEjHf pic.twitter.com/u0DQ2ok3gx
— ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | The Embassy of Afghanistan in New Delhi will cease operations from today, October 1; outside visuals from the Embassy https://t.co/btVHVLEjHf pic.twitter.com/u0DQ2ok3gx
— ANI (@ANI) October 1, 2023#WATCH | The Embassy of Afghanistan in New Delhi will cease operations from today, October 1; outside visuals from the Embassy https://t.co/btVHVLEjHf pic.twitter.com/u0DQ2ok3gx
— ANI (@ANI) October 1, 2023
భారత్‌లో ప్రస్తుతం అఫ్గాన్ రాయబారిగా ఫరిద్ మముండ్జే వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు ముందే ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ గని ఇతడిని నియమించారు. తాలిబన్ల ప్రభుత్వంలోనూ ఫరిద్ మముండ్జే అదే పదవిలో కొనసాగుతున్నారు. భారత్‌లో అఫ్గాన్ రాయబార కార్యాలయంలో ట్రేడ్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న ఖాదిర్ షా.. కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జ్‌ను అంటూ భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆరోపిస్తూ.. అఫ్గాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టారు. దానికి ముందు తాము మారిపోయామనీ, 1996 నుంచి 2001లో లాగా పాలన సాగించబోమని తాలిబన్లు చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగానే పాలన సాగుతోంది. రెండేళ్లు దాటిన అఫ్గాన్‌లో పూర్తిస్థాయిలో శాంతి నెలకొనలేదు. ఇంకా అతివాద మిలిటెంటు గ్రూపులు అక్కడ దాడులు చేస్తూనే ఉన్నాయి.
అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం
అఫ్గాన్‌లో బ్యూటీ సెలూన్లు బ్యాన్.. మహిళల అణచివేతకు తాలిబన్ల మరో నిర్ణయం