ETV Bharat / bharat

రేషన్​ బియ్యం కోసం సాహసం- రోజుల తరబడి ప్రయాణం - kani tribe ration struggle

ప్రపంచం అరచేతిలోకి వచ్చినా ఆధునిక భారతంలో రేషన్​ బియ్యం కోసం సాహస యాత్రలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి.. రోజుల తరబడి ప్రయాణాలు చేస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు?

Adventure trip for ration rice, desperate journey for survivors
రేషన్​ బియ్యం కోసం సాహసం- రోజుల తరబడి ప్రయాణం
author img

By

Published : Apr 28, 2022, 6:48 PM IST

Updated : Apr 29, 2022, 6:35 AM IST

రేషన్​ బియ్యం కోసం సాహసం- రోజుల తరబడి ప్రయాణం

ఆర్డర్​ చేసిన పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే.. ఈ యాప్​ల యుగంలో.. బియ్యం కొనడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారు 'కని' తెగకు చెందిన ఆదివాసీలు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా.. అధికారులు సహకరించకపోయినా.. బతకడానికి శక్తికి మించిన పోరాటమే చేస్తున్నారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని ఈ ఏజెన్సీ ప్రజలు.దశాబ్దాలుగా ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని వీరి బాధలు ఎంత చెప్పినా తక్కువే.

travel for ration
చెక్క పడవలో వెళ్తున్న ఆదివాసీలు

తిరునెల్వేలికి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజిక్కుళి అనే ప్రదేశంలో నివసిస్తుంది 'కని' తెగ. వీరు తిండిగింజల కోసం చేసే సాహసయాత్రలు అన్నీ ఇన్నీ కావు. ఇంజిక్కుళికి చాలా దూరంలో ఉండే.. చిన్న మైలార్ పంచాయతీలోని ప్రభుత్వ రేషన్​ షాపులో వీరికి ప్రతినెల రెండు సార్లు రేషన్​ ఇస్తారు. అది కూడా శనివారాలే. ఆ రేషన్ బియ్యం కోసం..​ వీరి ఇంటి నుంచి.. దట్టమైన అటవీ ప్రాంతంలో కరైయార్ రిజర్వాయర్​ వరకు 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ దారిలో క్రూరమైన వన్య మృగాలు ఉంటాయి. అనంతరం కరైయార్ రిజర్వాయర్​ నాలుగు కిలోమీటర్ల పాటు పడవలో ప్రయాణించాల్సి ఉంటుంది.అయితే అటవీ శాఖకు చెందిన పడవ ఉన్నా.. అందులో గిరిజనులే ఇంధనం నింపుకొని ప్రయాణించాలని అధికారులు చెప్పారు. దీంతో చేసేది ఏమీ లేక.. వారే చెక్కతో పడవను తయారు చేసుకున్నారు. మొసళ్లతో నిండి ఉన్న కరైయార్ రిజర్వాయర్​లో చెక్క పడవలో ప్రయాణించడం ప్రమాదం అని తెలిసినా.. ఇది తప్ప తమకు వేరే దిక్కులేదని చెబుతున్నారు ఆదివాసీలు.ఇన్ని ఇబ్బందులు నడుమ బియ్యం తెచ్చుకోవాడానికి ఆదివాసులకు మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఇక వర్షం పడితే.. అంతే సంగతులు. ఎన్నిరోజులైనా కావొచ్చు. రిజర్వార్​ వద్దకు వచ్చాక వర్షం వడితే.. తగ్గేవరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ కని తెగకు చెందిన ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు.

travel for ration
ఆదివాసీల గుడిసే

ఇదీ చడవండి: సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. కన్నతల్లిని కూడా..

Last Updated : Apr 29, 2022, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.