ETV Bharat / bharat

ADR Report on Rajya Sabha Members : రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనర్లే.. తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్!

ADR Report on Rajya Sabha Members : ప్రస్తుత రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని ADR-NEW నివేదిక ద్వారా వెల్లడైంది. వారిలో ఎక్కువ శాతం ఏపీ, తెలంగాణ నుంచే ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. రాజ్యసభ సభ్యులకు సంబంధించి మరిన్ని వివరాలను ఇలా ఉన్నాయి.

adr-report-on-memers-of-parliament-adr-report-on-billionaires-mps-and-criminal-cases-in-india
రాజ్యసభ సభ్యులపై ఏడీఆర్​ నివేదిక
author img

By

Published : Aug 18, 2023, 8:59 PM IST

ADR Report on Rajya Sabha Members : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్‌ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (NEW) అనే సంస్థతో కలిసి 225 మంది (మొత్తం 233 మంది సభ్యులు) రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదికను విడుదల చేసింది. అలాగే ఏపీ, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారని ఏడీఆర్​ నివేదికలో పేర్కొంది.

100 కోట్లకు పైగా ఆస్తులున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య..

  • ఏపీ నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా.. అందులో ఐదుగురు(45 శాతం)కి రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • తెలంగాణ నుంచి మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా.. వారిలో ముగ్గురు(43 శాతం)కి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • మహారాష్ట్రలోకు చెందిన 19 మందిలో రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు(16 శాతం)కి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • దిల్లీ నుంచి ప్రాతినిథ్య వహిస్తున్న ముగ్గురిలో సభ్యుల్లో ఒకరికి (33 శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • పంజాబ్​ 7 మంది ఎంపీల్లో ఇద్దరు ఎంపీలకు(29 శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • హరియాణాకు చెందిన ఐదుగురు ఎంపీల్లో ఒకరికి(20 శాతం) రూ.100కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • మధ్యప్రదేశ్​ పదికొండు మంది ఎంపీల్లో 2 ఇద్దరు(18) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
  • ప్రస్తుత రాజ్యసభలో ఒక సీటు​ ఖాళీగా ఉంది.

తెలంగాణకు చెందిన ఏడుగురి రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లుగా ఉందని ADR-NEW నివేదిక ద్వారా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లని తేలింది. ఉత్తర్​ప్రదేశ్​(30) రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.1,941 కోట్లని తమ ఉమ్మడి నివేదికలో ఈ సంస్థలు వెల్లడించాయి.

ప్రస్తుత రాజ్యసభ సిట్టింగ్​ ఎంపీల్లో 75 మంది(33 శాతం)పై క్రిమినల్​ కేసులున్నట్లు.. ఎన్నికల సమయంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆధారంగా ADR-NEW నివేదిక పేర్కొంది. అదే విధంగా 41 మంది (18 శాతం) ఎంపీలపై సీరియస్​ క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరు ఎంపీలపై హత్య కేసులున్నాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులున్నాయని ఈ నివేదిక తెలిపింది. ఈ నలుగురిలో రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్​పై అత్యాచార కేసు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది.

పార్టీల వారిగా క్రిమినల్​ కేసులున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య..

  • 85 మంది బీజేపీ ఎంపీల్లో 23 మంది(27 శాతం)పై క్రిమినల్​ కేసులు
  • 30 మంది కాంగ్రెస్​ ఎంపీల్లో 12 మంది (40 శాతం)పై క్రిమినల్​ కేసులు
  • తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన 13 మంది ఎంపీల్లో నలుగురి(31 శాతం)పై క్రిమినల్​ కేసులు
  • ఆర్​జేడీ నుంచి ఆరుగురు ఎంపీల్లో ఐదుగురిపై(83 శాతం) క్రిమినల్​ కేసులు
  • సీపీఐ(ఎం)​ నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురిపై(80 శాతం) క్రిమినల్​ కేసులు
  • ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది ఎంపీల్లో ముగ్గురు(30 శాతం)పై క్రిమినల్​ కేసులు
  • వైఎస్​ఆర్​సీపీ 9 మంది ఎంపీల్లో ముగ్గురు(33 శాతం)పై క్రిమినల్​ కేసులు
  • ముగ్గురు ఎన్​సీపీ ఎంపీల్లో ఇద్దరు ఎంపీ(67 శాతం)పై క్రిమినల్​ కేసులు

'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు

Isro Chandrayaan 3 : జాబిల్లి ఫొటోలను తీసిన విక్రమ్​ ల్యాండర్‌.. షేర్ చేసిన ఇస్రో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.