ETV Bharat / bharat

ఆ ఇంటిపై డౌట్.. చెక్ చేస్తే రూ.100 కోట్ల పురాతన వస్తువులు

బంగాల్​లో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన 1500 పురాతన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్లుగా ఉంటుంది. ముందుగా కస్టమర్ల రూపంలో వెళ్లిన అధికారులు.. అనంతరం ఆ వస్తువులను సీజ్​ చేసి, స్వాధీనం చేసుకున్నారు.

Administrator and welfare trustee west bengal seized Over 15000 antique items worth over Rs 100 crore
బంగాల్‌లో 15000 పురాతన వస్తువులు సీజ్ చేసిన అధికారులు
author img

By

Published : Jan 14, 2023, 6:46 PM IST

అక్రమంగా దాచిపెట్టిన రూ.100 కోట్లు విలువజేసే పురాతన వస్తువులను అధికారులు సీజ్​ చేశారు. బంగాల్​లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో.. ఓ వ్యక్తి నుంచి దాదాపు 1500 పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్​ ద్వారా అడ్మినిస్ట్రేటర్ జనరల్ అండ్​ వెల్ఫేర్ ట్రస్టీ అధికారులు.. దేగంగా ప్రాంతంలో ఈ దాడులు జరిపారు.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. చంద్రకేతుగర్​కు చెందిన అసద్ ఉల్ జమాన్ అనే వ్యక్తి నివాసంలో అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. ఈ వస్తువులు ప్రాచీన భారతదేశానికి చెందిన మౌర్య, కనిష్క సామ్రాజ్యం కాలం నాటివిగా వారు గుర్తించారు. ముందుగా అధికారులు కస్టమర్ల రూపంలో అసద్ ఉల్ జమాన్ ఇంటికి వెళ్లారు. అతని నుంచి అన్ని వివరాలు సేకరించిన అనంతరం వస్తువులను సీజ్​ చేశారు. ఈ వస్తువులను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు వారు తెలిపారు.

administrator-and-welfare-trustee-west-bengal-seized-over-15000-antique-items-worth-over-rs-100-crore
అధికారులు సీజ్​ చేసిన పురాతన వస్తువులు

"పురాతన వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు అసద్ ఉల్ జమాన్ గురించి మాకు తెలిసింది. దీంతో అతని ఇంటిపై దాడులు నిర్వహించాం. అసద్ వద్ద 15,000 పైగా పురాతన వస్తువులు ఉన్నాయి. వాటిలో 15, 20 మాత్రమే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన వస్తువులు. ధ్రువీకరణ సర్టిఫికెట్​ లేని వస్తువులను స్వాధీనం చేసుకున్నాం." అని అధికారి రాయ్‌ తెలిపారు.
2020 ఆగష్టులో కోల్‌కతా కస్టమ్స్ అధికారులు బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.35.3 కోట్లు విలువైన 25 పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో వడ్లను తీసుకెళ్తున్న ట్రక్కులో దాచిన పురాతన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.