ETV Bharat / bharat

Aditya L1 Launch : ఇస్రో 'ఆదిత్య' ప్రయోగానికి అంతా సిద్ధం.. సౌర వాతావరణ పరిశోధనే లక్ష్యం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 7:28 PM IST

Updated : Sep 2, 2023, 6:55 AM IST

Aditya L1 Launch : జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని శ్రీహరికోటలోని షార్‌ నుంచి చేపట్టేందుకు సన్నద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1ను PSLV-C57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లనుంది. సౌర తుపాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఓ అంచనాకు వచ్చేందుకు దోహదపడనుంది.

Aditya L1 Countdown
Aditya L1 Countdown

Aditya L1 Launch : సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా చేపడుతోన్న ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం.

Isro Aditya L1 Mission Launch Date : తొలుత ఆదిత్య ఎల్‌-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.

  • Here is the brochure: https://t.co/5tC1c7MR0u

    and a few quick facts:
    🔸Aditya-L1 will stay approximately 1.5 million km away from Earth, directed towards the Sun, which is about 1% of the Earth-Sun distance.
    🔸The Sun is a giant sphere of gas and Aditya-L1 would study the… pic.twitter.com/N9qhBzZMMW

    — ISRO (@isro) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Aditya L1 Mission Details : ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్​లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లు ఉన్నాయి.

What Is Aditya L1 Mission : సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

ISRO Aditya L1 Mission : 'మిషన్​ సూర్య' లాంఛ్​ రిహార్సల్​ సక్సెస్.. నింగిలోకి వెళ్లడమే తరువాయి..

Aditya L1 Mission Countdown : సూర్యుడి రహస్యాల గుట్టు విప్పనున్న ఇస్రో.. 'మిషన్​ సూర్య' కౌంట్​డౌన్​ స్టార్ట్​

Last Updated : Sep 2, 2023, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.