Adhir ranjan chowdhury lok sabha: క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం వైఖరేంటో స్పష్టంచేయాలని లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్‌కు గురికావడం తీవ్ర భద్రతాపరమైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. దేశ ప్రధాని ట్విటర్ ఖాతాకే భద్రత లేకపోతే మరి సామాన్యుల ఖాతాలు ఎలా సురక్షితమని ప్రశ్నించారు.
Pm twitter hacked: బిట్‌కాయిన్‌పై కఠిన నియంత్రణలు విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో.. భారత్ అధికారికంగా 500 బిట్‌కాయిన్లు కొనుగోలు చేసిందని, వాటిని ప్రజలందరికీ పంచనుందంటూ ప్రధాని ఖాతా నుంచి నిన్న వెలువడిన ట్వీట్ల అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశం ముందున్న అతిపెద్ద భద్రతా సమస్య ఇదేనన్నారు.
Center on cryptocurrency: క్రిప్టోకరెన్సీని గుర్తించే ప్రణాళిక ఏదైనా ఉంటే పార్లమెంట్ వేదికగా స్పష్టంచేయాలని అధిర్ డిమాండ్ చేశారు. రెండేళ్లలోనే రెండుసార్లు ప్రధాని ట్విటర్ ఖాతా ఎలా హ్యాక్‌కు గురైందో పార్లమెంట్‌కు చెప్పాలన్నారు. ప్రధాని ట్విటర్ ఖాతానే రెండేళ్ల వ్యవధిలో రెండుసార్లు హ్యాక్‌కు గురైతే.. ఇక దేశ భద్రతపై ఏ విధమైన భరోసా ఇవ్వగలమంటూ నిలదీశారు. దేశ భద్రత ప్రమాదంలో పడిందని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'సీబీఎస్ఈ పేపర్'పై రగడ- మోదీ ప్రభుత్వం క్షమాపణలకు సోనియా డిమాండ్
ఇదీ చూడండి: 'నేతాజీ మరణించారా? బతికే ఉన్నారా? రెండు నెలల్లో చెప్పండి!'