బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 30,100 ఆంఫోటెరిసిన్ బీ వయల్స్‌ను సోమవారం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"అన్ని రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర సంస్థలకు అదనంగా 30,100 ఆంఫోటెరిసిన్ బీ వయల్స్‌ను ఈరోజు (సోమవారం) కేటాయించడం జరిగింది."
- సదానంద గౌడ, కేంద్ర మంత్రి
బ్లాక్ ఫంగస్ ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకకు అదనంగా 1,930 ఆంఫోటెరిసిన్ బీ వయల్స్‌ను కేటాయించింది కేంద్రం. వీటితో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రం 12,710 వయల్స్‌ను పొందింది. కర్ణాటకలో ఇప్పటికే 1,250 మంది మ్యూకోర్ మైకోసిస్ సోకగా, 39 మంది చనిపోయారు. 18 మంది కోలుకున్నారు. మిగిలిన 1,193 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: Black fungus: భారత్ చేరిన 2 లక్షల ఇంజెక్షన్లు