ETV Bharat / bharat

ఏకంగా అదానీ కంపెనీకే షాక్.. 6వేల కేజీల ఇనుప వంతెన మాయం.. గ్యాస్​ కట్టర్​తో.. - అదానీ వంతెన మాయం

Adani Bridge Stolen : అదానీకి చెందిన ఓ వంతెనను మాయం చేశారు దొంగలు. ముంబయిలో ఉన్న 90 అడుగుల పొడవైన, 6,000 కేజీల ఇనుప వంతెన కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగతనం జరిగిన తీరు చూసి విస్తుపోయారు.

adani bridge stolen
adani bridge stolen
author img

By

Published : Jul 8, 2023, 1:12 PM IST

Adani Bridge Stolen : గుట్టుచప్పుడు కాకుండా 90 అడుగుల పొడవైన, 6,000 కేజీల ఇనుప వంతెన మాయం చేశారు దుండగులు. నిత్యం రద్దీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతం నుంచి ఇది కనిపించకుండా పోయింది. అది అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థకు చెందిన వంతెన అని పోలీసులు తేల్చారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ప్రముఖ వ్యాపార సంస్థ అదానీకి చెందిన భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గతేడాది జూన్‌లో మలాడ్‌ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను ఆ కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెనను నిర్మించారు. దాంతో ఆ పాత ఇనుప వంతెనను వినియోగించట్లేదు. కొద్దిరోజుల క్రితం 6,000 కేజీల బరువున్న ఆ వంతెన కనిపించకుండా పోయింది. రద్దీ ఉండే ప్రాంతం నుంచి అది అదృశ్యం కావడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై అదానీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు.

గ్యాస్ కట్టర్లతో వంతెనను ముక్కలుగా చేసి.. ఒక భారీ వాహనంలో దానిని తరలించిట్లు గుర్తించారు అధికారులు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. అందులో ఒకరికి ఈ వంతెన ఏర్పాటుతో కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ వంతెన నిర్మాణం కోసం కాంట్రాక్టు పద్ధతిలో అదానీ సంస్థలో పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని వివరించారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

80 అడుగులు ఐరన్ బ్రిడ్జ్​ మాయం..
Bridge Theft In Bihar : అంతకుముందు బిహార్​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బాంకా జిల్లా చందన్​ బ్లాక్​లో 2004 నాటి 80 అడుగుల ఐరన్​ బ్రిడ్జ్​ను గ్యాస్​ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది. ఝాఝా, పటానియా మధ్య ఉన్న వాగుపై 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. 1995లో భారీ వరదల సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రావణి జాతరలో ఝాఝా గ్రామం నుంచి పటనియా ధర్మశాలకు వెళ్లేందుకు ఊరేగింపు పెద్ద వాగులో నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పలువురు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్​ చేశారు. అప్పటి జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో వంతెన నిర్మించిన తర్వాత భక్తులు సులభంగా బాబా ధామ్​కు చేరుకోగలిగారు. అయితే, పుక్కా బ్రిడ్జ్​ సహా కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో దీనిని వినియోగించటం లేదు. దీంతో ఈ బ్రిడ్జ్​పై దొంగల కళ్లు పడ్డాయి.

ఇవీ చదవండి : రోడ్డును చోరీ చేసిన దొంగలు.. PWD మంత్రి సొంత జిల్లాలోనే ఘటన

రెచ్చిపోయిన దొంగలు.. మరో సెల్ టవర్ చోరీ.. 10 రోజుల్లో రెండో ఘటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.