Kabali Producer KP Chaudhary Drugs Case Update : రాజేంద్రర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్‌తో పట్టుబడిన సినీ నిర్మాత కేపీచౌదరి కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని సీనినటి జ్యోతి అన్నారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. కేపీ చౌదరి తనకు కేవలం కుటంబ సన్నిహితుడు మాత్రమే తప్ప.. తన వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె వెల్లడించారు.
ఈ కేసులో పోలీసులు తనకు నోటిసులు ఇస్తే విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. తన చరవాణి కూడా పోలీసులకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాని ఆమె స్పష్టం చేశారు. తన కాల్ డేటా సేకరించిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. తాను డ్రగ్స్ ఎప్పుడు విక్రయించలేదని.. ఎవరకి భయపడేదిలేదని వివరించారు.
"డ్రగ్స్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేపీ చౌదరితో కేవలం కుటుంబ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. నేను అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ను తీసుకోలేదు. కొన్ని మీడియా ఛానల్స్ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. దీని వలన మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. నా ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి సిద్ధం. అందులో డేటా తీయండి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం".- జ్యోతి, సినీ నటి
సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీకి తాను హజరుకాలేదని పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు తాను వెళ్లనని.. తనపై దుష్ప్రచారం చేయొద్దని నటి జ్యోతి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కేసులో తనకు సంబంధం లేకుండా కొన్ని మీడియాలు సంస్థలు తన ఫొటోలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన తమ కుటంబ సభ్యులతోపాటు సన్నిహతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. మహిళలపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రసారం చేయాలని కోరారు.
Surekha Vani on drug case : డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మరో నటి సురేఖ వాణి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. వాటివల్ల తమ కుటుంబం, పిల్లల భవిష్యత్ నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయద్దంటూ విజ్ఞప్తి చేశారు.
"కొందరు అదే పని గట్టు కొని నాపై ఆరోపణలు చేస్తున్నారు. నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. మీరు చేస్తున్న ఆరోపణలతో మా పిల్లలు, కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతోంది. దయచేసి మీరు ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చెయ్యెద్దు. నమ్మెద్దు".- సురేఖ వాణి, సినీ నటి
ఇవీ చదవండి: