ETV Bharat / bharat

చెక్కు బౌన్స్ కేసులో శరత్‌కుమార్‌, రాధికకు ఏడాది జైలు

Actor Sarath Kumar and wife radhika sentenced to one year jail term in cheque fraud case
శరత్‌కుమార్‌, రాధికకు ఏడాది జైలుశిక్ష
author img

By

Published : Apr 7, 2021, 1:37 PM IST

Updated : Apr 7, 2021, 2:11 PM IST

13:34 April 07

శరత్‌కుమార్‌, రాధికకు ఏడాది జైలుశిక్ష

తమిళ నటుడు శరత్​ కుమార్​, ఆయన భార్య నటి రాధికా శరత్​కుమార్​కు చెన్నై ప్రత్యేక న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. చెక్​బౌన్స్​ కేసులో ఈ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

తమపై ఉన్న రెండు చెక్​ బౌన్స్​ కేసుల్లో న్యాయవిచారణ రద్దు చేయాలని కోరుతూ 2019లో వీరు దాఖలు చేసిన పిటిషన్​ను మద్రాస్​ హైకోర్టు తోసిపుచ్చింది. నందనంలో సినిమా నిర్మాణాలకు రుణం అందించే రేడియన్స్​ మీడియా ప్రైవేట్​ లిమిటెడ్​ నుంచి తేయ్​నంపేట్​​కు చెందిన మేజిక్​ ఫ్రేమ్స్​ అనే సంస్థ భారీ మొత్తాన్ని రుణంగా తీసుకుంది. మేజిక్​ ఫ్రేమ్స్​ సంస్థలో నటుడు శరత్​  కుమార్​ ఆయన భార్య నటి రాధిక, లిస్టిన్​ స్టీఫెన్ భాగస్వాములుగా ఉన్నారు.

అయితే.. అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు.. తేదీలేని చెక్​లను శరత్​కుమార్ చెల్లించారు.  కానీ, 2017 మార్చిలో ఆ చెక్కులు బౌన్స్​ అయ్యాయి. దాంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రేడియన్స్​ మీడియా.

Last Updated : Apr 7, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.