ETV Bharat / bharat

ఎన్నికల బరిలో నటి రాధికా శరత్​కుమార్​ - తమిళనాడు ఎన్నికలు

సినీ నటి రాధికా శరత్​ కుమార్​ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ఆల్​ ఇండియా సమాత్తువ మక్కల్​ కాట్చి పార్టీ అధ్యక్షుడు శరత్​కుమార్​ వెల్లడించారు. మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధినేత కమల్​ హాసన్ తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు.​

radhika sarathkumar
ఎన్నికల బరిలో నటి రాధికా శరత్​కుమార్​
author img

By

Published : Mar 3, 2021, 7:50 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటి రాధికా శరత్​కుమార్​ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ఆల్​ ఇండియా సమాత్తువ మక్కల్​ కాట్చి పార్టీ అధినేత శరత్​కుమార్ బుధవారం వెల్లడించారు. తమిళనాడు తూత్తుకుడిలోని ట్రావియపురంలో నిర్వహించిన పార్టీ 6వ సర్వసభ్య సమావేశం​ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కోవిల్​పట్టి నియోజకవర్గం నుంచి రాధిక పోటీ చేయనున్నారని తెలిపారు.

sarathkumar, radhika
ప్రసంగిస్తున్న శరత్​కుమార్

మరోసారి అధినేతగా..

ఈ కార్యక్రమంలో భాగంగా సమాత్తువ మక్కల్​ కాట్చి కీలక పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అధినేతగా శరత్​కుమార్​ మరోసారి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఎన్ సుందరసన్​ కోశాధికారిగా ఎన్నికవగా.. పార్టీలో కొత్తగా ఏర్పాటైన ప్రిన్సిపల్ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ పదవికి రాధిక ఎన్నికయ్యారు. తమ కూటమికి మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ అధినేత కమల్​ హాసన్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని శరత్​కుమార్​ ప్రకటించారు.

ఇదీ చదవండి : కలాం సలహాదారుడికి కమల్​ పార్టీలో కీలక పదవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.