ETV Bharat / bharat

పైశాచికం.. వీధి కుక్కపై యాసిడ్​ పోసిన పోకిరీలు - వీధి కుక్కపై హింస

Attack on Stray Dog: ఓ వీధి కుక్కను దారుణంగా హింసించారు ఐదుగురు యువకులు. ఆ శునకంపై యాసిడ్​ పోశారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

Attack on Stray Dog
వీధి కుక్కపైన యాసిడ్​ దాడి
author img

By

Published : Mar 11, 2022, 1:31 PM IST

Attack on Stray Dog: మూగజీవిని హింసించడమే కాక దాని మీద యాసిడ్​ పోసి రాక్షసానందం పొందారు ఓ ఐదుగురు యువకులు. వారి వైఖరిని ప్రశ్నించిన ఓ మహిళను బెదిరించారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..

రోజూ రాత్రిళ్లు రోడ్లపైన తిరిగే నిందితులు.. వీధి కుక్కలను తంతూ హింసించేవారు. మార్చి 4న కూడా ఇదే విధంగా బానశంకరీలోని అంబేడ్కర్​ నగర్​ వద్ద తిరగడానికి వచ్చిన ఆ ఐదుగురు యువకులు.. వాళ్ల కంటపడ్డ ఓ వీధి కుక్కను హింసించారు. ఆ శునకాన్ని కట్టేసి దానిపై యాసిడ్​, పెట్రోల్​ పోశారు. ఇదంతా చూసిన ఓ 50 ఏళ్ల మహిళ వీరి వైఖరిపై ప్రశ్నించగా ఆమెను బెదిరించారు.

అనంతరం ఆ మహిళ.. ఓ సామాజిక కార్యకర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల హింసతో తీవ్ర గాయాలుపాలైన ఆ శునకాన్ని ఆస్పత్రికి తరలించారు. బన్నీగా పేర్కొనే ఈ కుక్క ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.