ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురిని హత్య చేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లాలోని పాచ్పాలి ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తిని టిమ్కిగా గుర్తించారు పోలీసులు.
టిమ్కి.. తొలుత తన అత్తవారింటి వద్ద ఇద్దరిని చంపి, తర్వాత తన ఇంటి వద్ద ముగ్గురిని కిరాతకంగా హత్యచేశాడు. వారిలో అతని భార్య, కుమారుడు, కూమార్తె, మరదలు సహా మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అయితే ఇందుకు కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: రైలు నుంచి జారిపడ్డ మహిళ- క్షణాల్లోనే...