ETV Bharat / bharat

రైల్వే 'వెయిటింగ్ లిస్ట్' దెబ్బ.. టికెట్ కొన్నా 2.7కోట్ల మందికి నిరాశ.. వారిలో మీరూ ఒకరా?

రైల్వేలో వెయిటింగ్​ లిస్ట్​ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.70 కోట్ల మందికి పైగా ప్రజలు రైలు ప్రయాణానికి దూరమయ్యారని రైల్వే శాఖ తెలిపింది. టికెట్ల కొనుగోలు చేసినప్పటికీ.. రద్ధీ మార్గాలలో రైళ్ల కొరత కారణంగా తమ ప్రయాణాన్ని సాగించలేకపోయారని పేర్కొంది.

railway waitlisted tickets
railway waitlisted tickets
author img

By

Published : May 8, 2023, 7:00 PM IST

దేశంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను రైల్వే శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2022-2023 ఆర్థిక సంవత్సరంలోనే 2.70 కోట్ల మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1.76 కోట్ల మంది పేర్లు మాత్రమే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (పీఎన్​ఆర్​) నమోదయయ్యాని రైల్వే శాఖ వెల్లడించింది. వెయిట్‌లిస్ట్ కారణంగా మిగతా వారి పేర్లు ఆటోమేటిక్‌గా రద్దు అయినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

2021-2022లో 1.65 కోట్ల మంది ప్రయాణించాల్సి ఉండగా.. ప్యాసింజర్ నేమ్ రికార్డ్​లో 1.06 కోట్ల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణం రద్దు అయిన ప్రయాణికుల సొమ్మును తిరిగి వారికి చెల్లించినట్లు స్పష్టం చేసింది. 2014-15లో 1.13 కోట్లు, 2015-2016లో 81.05 లక్షలు, 2016-17లో 72.13 లక్షలు, 2017-18లో 73 లక్షల మంది ప్రజల రైలు ప్రయాణం రద్దు అయిందని రైల్వే శాఖ వెల్లడించింది. 2018-19లో మరో 68.97 లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయలేకపోయారని పేర్కొంది.

డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రైళ్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇది ప్రయాణికుల వెయిటింగ్​ లిస్ట్​ను తగ్గిస్తుందని పేర్కొంది. కొవిడ్​కు ముందు 10,186 రైళ్లను నడిపామని.. కరోనా అనంతరం వాటిని 10,678కి పెంచినట్లు వివరించింది. అన్ని మార్గాల్లో సిగ్నలింగ్​, ట్రాక్​ పనులు జరుగుతున్నాయని తెలిపిన రైల్వేశాఖ.. ఆ మార్గాల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

బ్రిటిషర్లకు అద్దె..
గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రైల్వే శాఖోపశాఖలుగా విస్తరించింది. కొత్త లైన్లు, రైళ్లు వేస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది ఇండియన్ రైల్వేస్. భారత దేశం నలుమూలలా లైన్లను విస్తరించి.. తన ఆధీనంలో పెట్టుకున్న భారతీయ రైల్వే.. ఇప్పటికీ ఒక లైన్​పై రైలును నడిపింనందుకు అద్దెను కడుతోంది. మనదేశంలో భారతీయ రైల్వేకు చెందినది కాకుండా ప్రైవేట్​ లైన్​ ఉందా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ లైన్​ కథ తెలుసుకోవాల్సిందే..! ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.