ETV Bharat / bharat

గోవా ప్రజలకు కేజ్రీవాల్ వరాలు.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు! - గోవా ఎన్నికలు ఆమ్ ఆద్మీ

AAP 13 Point agenda Goa: గోవా ప్రజలపై వరాల జల్లు కురిపించారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి కుటుంబం రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని చెప్పారు.

kejriwal goa election agenda
kejriwal goa election agenda
author img

By

Published : Jan 16, 2022, 4:00 PM IST

AAP 13 Point agenda Goa: గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అక్కడి ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ 13 పాయింట్ల అజెండాను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యా, వైద్యం, వ్యాపారం, జీవనోపాధి, మైనింగ్, మౌలిక వసతులు సహా పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Goa election 2022 AAP

గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

AAP 13 Point agenda Goa
గోవా ప్రజలతో కేజ్రీవాల్...

నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి అందించనున్నట్లు తెలిపారు.

18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి సాయం చేస్తామని వెల్లడించారు.

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని మాటిచ్చారు.

AAP 13 Point agenda Goa
ఓ పెద్దాయనతో కేజ్రీవాల్

ప్రతి గ్రామంలో మొహల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని వివరించారు.

గోవాలో 24 గంటల విద్యుత్‌, నీటి సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.

AAP 13 Point agenda Goa
ఆప్ ఎన్నికల హామీ పత్రాన్నిఅందిస్తున్న కేజ్రీవాల్

Kejriwal campaign in Goa

"గోవా ప్రజలు ఫిబ్రవరి 14న జరగనున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వారికి ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకుముందు భాజపా, కాంగ్రెస్ తప్ప మూడో ప్రత్యామ్నాయం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆప్ ఉంది. రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. ఆప్ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తాం."

-అరవింద్ కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వినర్

Kejriwal Door campaign Goa

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు కేజ్రీవాల్. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందితే.. ప్రతి కుటుంబానికి రూ.50 వేల వరకు డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం రూ.22 వేలు ఆదా చేసుకుంటుందని తెలిపారు. ఇలా.. ఆప్ అధికారంలోకి వస్తే గోవాలోని ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా రూ.10 లక్షల మేర ప్రయోజనం పొందుతుందని అన్నారు.

ముందు దిల్లీకి వెళ్లండి!

మరోవైపు, కేజ్రీవాల్ గోవాలో ఇంటింటి ప్రచారం చేయడాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఆ ప్రాంత ముఖ్యమంత్రి గోవా వెళ్లి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆయన అవసరం గోవా కంటే దిల్లీకే ఎక్కువ ఉందని అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తోందని చెప్పారు. 10-15 స్థానాల్లో బరిలోకి దిగుతుందని తెలిపారు. ఎన్​సీపీ నేతలు సైతం గోవా వస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పేలుడు పదార్థాల కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.