AAI ATC Jobs 2023 : విమానయాన రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్త. న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఏఏఐ కార్యాలయాల్లోని 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల (AAI Junior Executive Jobs 2023)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం ఖాళీలు..
AAI ATC Job Vacancy : 496 - జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులు
ఏజ్ లిమిట్..
AAI ATC Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
విద్యార్హతలు..
AAI ATC Jobs For Engineers : అభ్యర్థులు బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము(AAI ATC Jobs Application Fee)..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000/- దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ చేసిన అభ్యర్థులకు కూడా ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.
ఎంపిక విధానం (AAI ATC Jobs Selection Process)..
- రాత పరీక్ష(ఆన్లైన్ టెస్ట్)
- వాయిస్ టెస్ట్
- సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతభత్యాలు..
AAI ATC Jobs Salary : ఉద్యోగంలో చేరాక రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ప్రతి నెలా వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం..
AAI ATC Jobs Apply : అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్..
AAI Official Website : వయోపరిమితి సడలింపులు, పరీక్ష తేదీలు, సిలబస్ సహా నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్సైట్ www.aai.aero ను సందర్శించవచ్చు.
జాబ్ లొకేషన్..
AAI ATC Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కార్యాలయాల్లో ఎక్కడైనా పోస్టింగ్ కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు(AAI ATC Jobs Important Dates)..
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 1
- దరఖాస్తుకు చివరి తేదీ : 2023 నవంబర్ 30
టెన్త్ అర్హతతో రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు- ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగం!
వేలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు, 15 రోజుల్లో నోటిఫికేషన్- పది పాసైతే చాలు!