AAI Apprentice Jobs 2024 : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 130 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
AAI Apprentice Posts :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 30 పోస్టులు
- డిప్లొమా అప్రెంటీస్ - 45 పోస్టులు
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ - 55 పోస్టులు
విభాగాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : ఏరోనాటికల్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, మెకానికల్
- డిప్లొమా అప్రెంటీస్ : ఏరోనాటికల్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, మెకానికల్, మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్
- ఐటీఐ ట్రేడ్ : కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్, స్టెనో
విద్యార్హతలు
AAI Apprentice Qualifications :
- గ్రాడ్యుయేట్, డిప్లొమా పోస్టులకు, రెగ్యులర్ బేసిస్‌లో 3 లేదా 4 ఏళ్ల కాలవ్యవధిగల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే బీఈ/ బీటెక్ చేసి ఉండాలి.
- ఐటీఐ ట్రేడ్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు, ఆయా విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
AAI Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
AAI Apprentice Application Fee : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
AAI Apprentice Selection Process : క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే జాయినింగ్ సమయంలో అభ్యర్థులు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు
AAI Apprentice Salary :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లకు నెలకు రూ.15,000 జీతం ఇస్తారు.
- డిప్లొమా అప్రెంటీస్లకు నెలకు రూ.12,000 సాలరీ ఇస్తారు.
- ట్రేడ్ అప్రెంటీస్లకు నెలకు రూ.9000 సాలరీ ఉంటుంది.
దరఖాస్తు విధానం
AAI Apprentice Application Process :
- గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థులు https://nats.education.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- ఐటీఐ అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా Apply లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ నమోదు చేసి పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్‌చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ
AAI Apprentice Apply Last Date : 2024 జనవరి 31
స్పోర్ట్స్ కోటాలో 169 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
ఇంజినీరింగ్ అర్హతతో NLCలో 632 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!