వ్యక్తులకు కేటాయించిన ఆధార్(Aadhar Card ) సంఖ్యను మార్చివేసి మరో సంఖ్యను కేటాయించడం సాధ్యం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి కనుక ఒక్కసారి అనుమతిస్తే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థనలు(Aadhar Card Update) వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఓ వ్యాపారి తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను(Aadhar Card Number) మార్చాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తన ఆధార్ గుర్తుతెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేఖా పల్లి విచారణకు చేపట్టారు. గురువారం ఉడాయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...ప్రతి ఆధార్ కార్డుదారు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: దీదీపై పోటీ చేయనున్న భాజపా అభ్యర్థి ఎవరంటే?