ETV Bharat / bharat

Aadhar Card Free Update Date Extended 2023 : ఆధార్‌ ఫ్రీ అప్డేట్.. మళ్లీ గడువు పెంచిన కేంద్రం..! - ఆధార్ కార్డ్ అప్‌డేట్ ఉచితంగా

Aadhar Card Free Update Date Extended 2023 : ఉచితంగా ఆధార్ కార్డులో తప్పులు సరిదిద్దుకునే అవకాశాన్ని కేంద్రం మళ్లీ పొడిగించింది. మరి, ఈ సేవను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Aadhar Card Free Update Date Extended 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 12:54 PM IST

Aadhar Card Free Update Date Extended 2023 : దేశంలో ప్రతి ఒక్కరికీ.. ఆధార్‌ కార్డ్‌ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ఇది తప్పనిసరి అయింది. ఒక వ్యక్తికి ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఆధార్‌ కార్డ్ ముఖ్యమైందిగా మారిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు ఆధార్‌ కార్డ్‌లో చిన్న తప్పులు ఉన్న కూడా మొదటికే మోసం వస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరఖాస్తు మొదలు చాలా పనులకు ఇబ్బందిగా మారుతోంది.

Aadhar Free Update Date Extended 2023 : దీంతో.. ఆధార్‌ కార్డ్‌లో మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో చిరునామా, పుట్టినతేదీ, మొబైల్‌ నెంబర్‌ను ఉచితంగా మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ సౌకర్యం గతంలోనే కల్పించింది. అయితే.. ప్రజా అవసరాల దృష్ట్యా ఈ గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజా పెంపు ప్రకారం.. డిసెంబర్‌ 14వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఆ లోపు ఎవరైనా ఉచితంగా ఆధార్‌ కార్డ్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే.. ఆధార్ కార్డ్‌లో రెటీనా స్కాన్‌లు, వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌, బయోమెట్రిక్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవడానికి.. మీ దగ్గరలోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్‌ కార్డ్‌లోని ఫొటోను మార్చడానికి ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్చడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

How to Check Aadhaar Update History in Online : ఆధార్ అప్​డేట్ చేసుకున్నారా.. లేదా..? ఇది చదవాల్సిందే..!

Aadhar Card Update Free : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో చిరునామాను మార్చడం ఎలా:

  • అధికారిక పోర్టల్‌ uidai.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.
  • మై ఆధార్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కిందికి స్కోల్‌ చేసి అప్‌డేట్‌ యువర్ ఆధార్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయండి.
  • ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ ఆధార్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇక్కడ మీరు మీ ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  • ఇప్పుడు మీకు ఒక ఓటీపీ (OTP) వస్తుంది, దాన్ని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వండి.
  • ఇప్పుడు మీరు ఏ సమాచారాన్ని మార్చాలనుకుంటున్నారో.. ఆ ఆప్షన్‌పైన క్లిక్‌ చేసి, దానికి సంభందించిన డాక్యుమెంట్‌లను సబ్‌మిట్‌ చేయండి.
  • డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేసిన తరవాత, సబ్‌మిట్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇలా చేయగానే మీ ఆధార్‌ కార్డ్‌ రిజిస్ట్రర్డ్‌ మొబైల్ నెంబర్‌కు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ (URN), SMS రూపంలో వస్తుంది. దీని వల్ల మీ ఆధార్ కార్డ్‌ అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

మీరు myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌ను ఒపేన్‌ చేసి అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. దీనికోసం మొదట URN నెంబర్‌ను ఎంటర్‌ చేసి క్యాప్చాను నమోదు చేయాలి.

ఇంటి చిరునామా మార్పు కోసం కావాల్సిన డాక్యుమెంట్స్:
రేషన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, విద్యుత్/నీరు/గ్యాస్ బిల్లు (గత 3 నెలలు), బ్యాంక్/పోస్టాఫీసు పాస్‌బుక్, అద్దె/లీజు/ సెలవు, లైసెన్స్ ఒప్పందం, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు/సర్టిఫికేట్ చిరునామాను మార్చడానికి రుజువుగా ఉపయోగపడతాయి.

ఆధార్ కార్డ్‌లో ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలి:

  • మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
  • ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను తీసుకోండి, లేదా UIDAI వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌లో సంబంధిత వివరాలను నింపండి.
  • అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను అందించి.. బయోమెట్రిక్‌ వివరాలను ఇవ్వండి.
  • మీ ఫొటోను ఎగ్జిక్యూటివ్‌ తీస్తారు. వారికి ఆధార్‌ కార్డ్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసినందుకు రూ.100 రుసుము చెల్లించాలి.
  • మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో పాటు రసీదు స్లిప్ అందిస్తారు.
  • మీరు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ (URN)ను, ఉపయోగించడం ద్వారా మీ అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

How To Check Which Phone Numbers are Linked to Your Aadhaar - సిమ్​కార్డ్​ స్కాం.. మీ ఆధార్​ కార్డ్​తో వేరేవాళ్లు మొబైల్​ నంబర్​ తీసుకున్నారా? చెక్​ చేసుకోండిలా..

మీ ఆధార్​లో అడ్రస్​ మార్చాలనుకుంటున్నారా?.. ఇక చాలా ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.