ETV Bharat / bharat

ఫింగర్​ ప్రింట్స్​ లేకున్నా ఐరిస్​తో ఆధార్​ జారీ- కేంద్రం కీలక నిర్ణయం - దివ్యాంగులకు ఆధార్ కార్డు

Aadhaar New Update Iris : ఆధార్​ కార్డు పొందేందుకు వేలిముద్రలు పడనివారికి కేంద్రం గుడ్​న్యూస్ చెప్పింది. ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కార్డును పొందవచ్చని తెలిపింది.

aadhaar new update iris
aadhaar new update iris
author img

By PTI

Published : Dec 9, 2023, 7:51 PM IST

Updated : Dec 9, 2023, 10:20 PM IST

Aadhaar New Update Iris : వేలిముద్రలు పడనివారు ఐరిస్ స్కాన్​ ద్వారా ఆధార్​ను పొందవచ్చని కేంద్రం ప్రకటించింది. వేళ్లు లేని కారణంగా ఆధార్ పొందలేనివారు ఐరిస్​ స్కాన్ ద్వారా ఆధార్ కార్డు పొందవచ్చని పేర్కొంది. కేరళకు చెందిన ఓ మహిళకు ఆధార్ కార్డు జారీ జాప్యమైన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది.

అసలేం జరిగిందంటే?
ఆధార్​ కార్డు రిజిస్ట్రేషన్ సమయంలో కొట్టాయంకు చెందిన పీ జోస్ అనే మహిళ చేతి వేళ్లు లేకపోవడం వల్ల వేలిముద్రలు వేయలేకపోయింది. దీంతో ఆమెకు ఆధార్​ కార్డు మంజూరు అవ్వలేదు. ఈ విషయం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దృష్టికి వచ్చింది. ఆయన జోక్యంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) బృందం జోస్​ ఇంటిని సందర్శించి ఆమెకు ఆధార్ కార్డును మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో చేతివేళ్లు లేని వ్యక్తులు, అస్పష్టంగా వేలిముద్రలు పడినవారు లేదా చేతి అంగవైకల్యం ఉన్నవారు ఐరిస్ ద్వారా ఆధార్​ కార్టు పొందవచ్చని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఐరిస్​ స్కాన్​ ద్వారా బయోమెట్రిక్ తీసుకుని వారికి ఆధార్​ కార్డు జారీ చేయాలని ఆధార్ సేవా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఐరిస్‌, వేలిముద్రలు సమర్పించలేకపోయినా అర్హులైన వారికి కూడా ఆధార్‌ అందజేయాలని ప్రభుత్వం ఇదివరకే నిబంధనల్లో పేర్కొంది. ఈ రెండు ఆధారాలు సమర్పించలేకపోవటానికి గల కారణాల్ని తెలుపుతూ ఫొటో ద్వారా ఆధార్‌కు నమోదు చేసుకోవచ్చు.

కొట్టాయంకు చెందిన పీ జోస్​కు ఇంతకాలం ఆధార్ మంజూరు కాకపోవడంపై యూఐడీఏఐ విచారం వ్యక్తం చేసింది. ఆమెకు ఆధార్ జారీ జాప్యం అవ్వడానికి కారణాన్ని తెలిపింది. ఆమె ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ విషయంలో ఆపరేటర్ సాధారణ విధానాన్నే అనుసరించారని పేర్కొంది. వేలిముద్రలు పడనప్పుడు ఉపయోగించాల్సిన విధానాన్ని ఆయన ఆనుసరించలేదని తెలిపింది.

How To Update Aadhaar Card Online In Telugu : 10 ఏళ్లుగా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్​ చేసుకోనివారి కోసం ఇటీవల మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికీ ఆధార్​లో తమ వ్యక్తిగత వివరాలు మార్చుకోనివారు.. డిసెంబర్​ 14లోపు ఆన్​లైన్​లో ఉచితంగా మార్చుకోవచ్చు. మరి ఆన్​లైన్​లో ఫ్రీగా ఆధార్​ కార్డ్​ను ఎలా​ అప్డేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు : హైకోర్టు

స్టూడెంట్స్​ ఫిట్​నెస్​ కోసం ప్రిన్సిపల్​ 'ఎగ్​ ఛాలెంజ్'​- రోజూ 6కి.మీ రన్నింగ్​ చేస్తే గిఫ్ట్​లుగా గుడ్లు!

Last Updated : Dec 9, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.