ETV Bharat / bharat

గదిలో బంధించి.. తొమ్మిది రోజులపాటు గ్యాంగ్​రేప్! - గదిలో బంధించి

ఓ వివాహితను గదిలో నిర్భందించి.. తొమ్మిది రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు కిరాతకులు. అనంతరం ఎలాగోలా.. వారి నుంచి తప్పించుకున్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

a woman was raped 9 days
గదిలో బంధించి
author img

By

Published : Jul 14, 2021, 9:10 PM IST

ఓ మహిళను గదిలో నిర్భందించి.. తొమ్మిది రోజులపాటు లైంగికంగా వేధించారు దుండగులు. ఎట్టకేలకు బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హరియాణాలో జరిగింది.

ఏం జరిగిందంటే..

హరియాణా.. గురుగ్రామ్​ జిల్లా.. సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల 30న పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుండగా.. అతని ఇద్దరు స్నేహితులు కారులో వచ్చి ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్‌లో ఓ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

తొమ్మిది రోజుల తర్వాత.. జులై 8న ఆమె వారి నుంచి తప్పించుకొని భల్లబ్‌గఢ్‌ బస్‌స్టేషన్‌ చేరుకుంది. అక్కడి నుంచి వారి కుటుంబానికి ఫోన్‌ చేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అహరించిన వారు తనకు తెలుసని, వారిలో ఒకరు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు బాధితురాలికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సహకరించిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసులపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : 'నా కోరిక తీర్చు.. పరీక్షల్లో మార్కులేస్తా'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.