ETV Bharat / bharat

'358 రోజుల ఉక్కు సంకల్పం'తో అన్నదాతల విజయం!

రైతుల పోరాటానికి(farmers protest) కేంద్రం దిగొచ్చింది. నూతన సాగు చట్టాలను(Farm laws) రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. ఏడాది కాలంగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని.. వెనుదిరగకుండా నిరసనలు కొనసాగించారు రైతులు. వ్యవసాయ చట్టాలపై కర్షకుల పోరాటం తీరును ఓసారి పరిశీలిద్దాం.

farmers protest
సాగు చట్టాలపై రైతుల పోరాటం
author img

By

Published : Nov 19, 2021, 12:48 PM IST

వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మూడు కొత్త సాగు చట్టాలను(new farm laws) తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టాల వల్ల కనీస మద్దతు ధర దక్కకుండా పోతుందని, కార్పొరేట్ల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యతిరేకత మొదలైంది. 'రైతు వ్యతిరేక చట్టాల'ను రద్దు చేయాలని(Farm laws repealed) డిమాండ్​ చేస్తూ 2020 నవంబర్ 26న దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు(Farmers protest) దిగారు అన్నదాతలు. తమ పోరాటాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చారు. పలు దఫాలుగా చర్చలు చేపట్టినా.. రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు.

farmers protest
దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన

దాదాపు ఏడాది తర్వాత(2021 నవంబర్ 19) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM modi news) సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.

రైతుల పోరాటం(Farmers protest against farm laws) ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పక తప్పదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. పోలీసుల అరెస్టులు, హింసాత్మక ఘటనలు జరిగినా.. వెన్నుచూపకుండా ఏడాది కాలంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

సాగు చట్టాలు, రైతుల పోరాటం ఇలా సాగింది..

  • 2020, జూన్​ 5: రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020, అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
  • 2020, సెప్టెంబర్​ 14: సాగు చట్టాలపై ఆర్డినెన్స్​ను బిల్లు రూపంలో పార్లమెంట్​ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం
  • 2020, సెప్టెంబర్​ 17: లోక్​సభలో బిల్లుకు ఆమోదం లభించింది.
  • 2020, సెప్టెంబర్​ 20: ఆర్డినెన్స్​కు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది.
  • 2020, సెప్టెంబర్​ 24: సాగు చట్టాలను నిరసిస్తూ మూడు రోజుల రైల్​ రోకో చేపట్టాలని పంజాబ్​ రైతులు పిలుపునిచ్చారు.
  • 2020, సెప్టెంబర్​ 25: అఖిల భారత కిసాన్​ సంఘర్షణ సహకార కమిటీ(ఏఐకేఎస్​సీసీ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
    farmers protest
    సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న రైతులు
  • 2020, సెప్టెంబర్​ 27: సాగు చట్టాల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. గెజిట్​ విడుదల
  • 2020, నవంబర్​ 25: పంజాబ్​, హరియాణాలోని రైతు సంఘాలు దిల్లీ చలో ఉద్యమానికి పిలుపునిచ్చాయి. కొవిడ్​-19 కారణంగా చూపుతూ దిల్లీలో రైతుల ర్యాలీకి పోలీసులు నిరాకరించారు.
  • 2020, నవంబర్​ 26: దిల్లీ వైపు వందల సంఖ్యలో రైతులు తరలివెళ్లారు. ఈ క్రమంలో హరియాణా అంబాలా జిల్లాలో రైతులపై బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. ఆ తర్వాత వాయవ్య దిల్లీలోని నిరంకారి మైదానంలో శాంతియుత నిరసనలకు అంగీకరించారు.
  • 2020, నవంబర్​ 28: రైతులను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చర్చలకు ఆహ్వానించారు. అందుకు రైతులు నిరాకరించారు. జంతర్​మంతర్​ వద్ద నిరసనలు తెలిపేందుకు అనుమతించాలని డిమాండ్​ చేశారు.
  • 2020, డిసెంబర్​ 3: రైతు నేతలతో తొలిసారి చర్చలు చేపట్టింది ప్రభుత్వం. అయితే, ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు.
    farmers protest
    ఆందోళనలో పాల్గొన్న రైతులు
  • 2020, డిసెంబర్​ 5: కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య రెండో దఫా చర్చలు
  • 2020, డిసెంబర్​ 8: భారత్​ బంద్​కు రైతులు పిలుపునిచ్చారు. ఈ బంద్​కు ఇతర రాష్ట్రాల రైతులు సైతం మద్దతు పలికారు.
  • 2020, డిసెంబర్​ 9: సాగు చట్టాలల్లో సవరణలు చేస్తామని, తగిన సూచనలు చేయాలన్న కేంద్రం పిలుపును తిరస్కరించారు రైతులు. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు చెప్పారు.
  • 2020, డిసెంబర్​ 11: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది భారతీయ కిసాన్​ యూనియన్​.
  • 2020, డిసెంబర్​ 16: వ్యవసాయ చట్టాలపై చెలరేగిన వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం, రైతు సంఘాల​ ప్రతినిధులతో ప్యానల్​ ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
  • 2020, డిసెంబర్​ 21: దిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు రైతులు
  • 2020, డిసెంబర్​ 30: రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరో దఫా చర్చలు జరిగాయి. పంట వ్యర్థాల దహనానికి జరిమానా విధించటం, విద్యుత్తు సవరణ బిల్లును వెనక్కి తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
  • 2021, జనవరి 4: ఏడో రౌండ్​ చర్చలు జరిగాయి. సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం అంగీకరించకపోవటం వల్ల ఎలాంటి ఫలితం రాలేదు.
  • 2021, జనవరి 7: సాగు చట్టాలకు వ్యతిరేకంగా, నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జనవరి 11న విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
  • 2021, జనవరి 11: రైతుల నిరసనలపై కేంద్రం తీరును తప్పుపట్టింది సుప్రీం కోర్టు. మాజీ సీజేఐ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
  • 2021, జనవరి 12: కొత్త సాగు చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని వర్గాలతో చర్చించి తగు సూచనలు చేయాలని కమిటీకి తెలిపింది. అదే రోజున దిళిత లేబర్​ కార్యకర్త నొదీప్​ కౌర్​ను సోనిపట్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. హత్య, అల్లర్లు, దాడుల వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.
  • 2021, జనవరి 26: రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లతో దిల్లీ నగరంలోకి ప్రవేశించే క్రమంలో ఉద్రక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు జరిగాయి. సింఘూ, గాజిపుర్​ సరిహద్దులో నిరసనలు ఉద్రిక్తంగా మారిన క్రమంలో కొందరు రైతులు.. ఇతర మార్గాల్లో దిల్లీ ఐటీఓ, ఎర్రకోట వైపు వెళ్లారు. ఈ క్రమంలో రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఎర్రకోటపై కొందరు నిషాన్​ సాహిబ్​ జెండాను ఎగురవేశారు. ఈ ఆందోళనల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు.
    farmers protest
    ట్రాక్టర్​ ర్యాలీ
    farmers protest
    ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • 2021, జనవరి 28: దిల్లీ గాజిపుర్​ సరిహద్దులోని ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయాలని ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​ జిల్లా యంత్రాంగం ఆందేశాలు ఇచ్చింది. పోలీసులు రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా.. రైతులు వారిని నిలువరించారు. సరిహద్దులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని బికేయూ నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు.
  • 2021, ఫిబ్రవరి 4: రైతులకు మద్దతుగా నిలిచిన సెలబ్రిటీలు, ఇతరులను కేంద్ర తప్పుపట్టింది. వారిది బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించింది. రిహన్నా, గ్రేటా థన్​బర్గ్​, న్యాయవాది మీనా హరీస్(కమలాహారిస్​ మేనకోడలు) వంటి వారు రైతులకు మద్దతు తెలిపిన క్రమంలో ఈ విధంగా స్పందించింది.
  • 2021, ఫిబ్రవరి 5: టూల్​ కిట్​ వ్యవహారంపై రాజద్రోహం, క్రిమినల్​ కుట్ర, ద్వేషం వంటి వాటిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు దిల్లీ పోలీసులు.
  • 2021, ఫిబ్రవరి 6: దేశవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించారు రైతులు. మధ్యహ్నం 12 నుంచి 3 గంటల వరకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
  • 2021, ఫిబ్రవరి 9: గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసలో ప్రధాన నిందితుడు పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూను దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం అరెస్ట్​ చేసింది. ఆ తర్వాత ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
  • 2021, ఫిబ్రవరి 14: టూల్​ కిట్​ కేసులో 21 ఏళ్ల పర్యావరణ కార్యకర్త దిశా రవిని దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు.
  • 2021, ఫిబ్రవరి 18: దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం). పట్టాలపైకి వచ్చి రైతులు ఆందోళన చేసిన క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.
    farmers protest
    పట్టాలపై రైతుల నిరసన
    farmers protest
    రైల్​ రోకోలో ఓ రైతు
  • 2021, ఫిబ్రవరి 23: పర్యావరణ కార్యకర్త దిశా రవికి దిల్లీ సెషన్స్​ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
  • 2021, ఫిబ్రవరి 25: దళిత్​ లేబర్​ కార్యకర్త నొదీప్​ కౌర్​కు బెయిల్​ మంజూరు.
  • 2021, మార్చి 2: పంజాబ్​ విధానసభ ముట్టడికి ప్రయత్నించిన శిరోమణి అకాలీ దల్​ అధినేత సుఖ్బీర్​ సింగ్​ బాదల్​, ఇతర నేతలన చంఢీగడ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.
  • 2021, మార్చి 5: సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్​ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.
  • 2021, మార్చి 6: దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేపట్టి 100 రోజులు పూర్తి
  • 2021, మార్చి 8: సింఘూ సరిహద్దులో కాల్పుల కలకలం.
  • 2021, ఏప్రిల్​ 4: పలు ట్రాక్టర్లు సింఘూ సరిహద్దు నుంచి పంజాబ్​కు తిరిగి వెళ్లిన క్రమంలో వెదురు బొంగులతో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు.
  • 2021, ఏప్రిల్​ 15: రైతులతో చర్చలు చేపట్టి, పరిష్కారం చూపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా.
  • 2021, ఏప్రిల్​ 26: దీప్​ సిద్ధూకు రెండో బెయిల్​ మంజూరు
  • 2021, మే 27: ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న క్రమంలో బ్లాక్​ డేను పాటించారు రైతులు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆందోళనలు 2024 వరకు కొనసాగుతాయని ప్రకటించారు.
  • 2021, జూన్​ 5: వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంపూర్ణ క్రాంతికారి దివాస్​ను పాటించారు రైతులు.
  • 2021, జూన్​ 26: నిరసనలు చేపట్టి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీ వైపు ర్యాలీ చేప్టటారు రైతులు. హరియాణా, పంజాబ్​, కర్ణాటక, ఉత్తరాఖండ్​, మధ్యప్రదేశ్​, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రైతులను అరెస్టులు చేసినట్లు రైతు నేతలు ఆరోపించారు.

  • 2021, జులై: సాగు చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్​ సమీపంలో సుమారు 200 మంది రైతులు నిరసనలు తెలిపారు. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు మహాత్ముడి విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ట్రాక్టర్​పై పార్లమెంట్​కు వెళ్లి నిరసనలకు మద్దతు తెలిపారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.
    farmers protest
    ట్రాక్టర్​పై రాహుల్​ గాంధీ
  • 2021, ఆగస్టు 7: దిల్లీ జంతర్​ మంతర్​ వద్ద రైతుల నిరసనలకు మద్దతు పలకాలని 14 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. రాహుల్​ గాంధీ సహా కీలక విపక్ష నేతలు రైతులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు.
    farmers protest
    రైతులకు మద్దతుగా విపక్షాల నిరసన
  • 2021, ఆగస్టు 28: హరియాణా, కర్నాల్​లో బస్తారా టోల్​ ప్లాజా వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం​ కోసం భాజపా సమావేశం నిర్వహించగా రైతులు ఆందోళనలు చేపట్టారు. భాజపా నేతల వాహనాలు వెళుతుంటే నల్ల జెండాలు ప్రదర్శించారు. రోడ్లపై బైఠాయించి, వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. లాఠీఛార్జ్​ చేశారు పోలీసులు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. రైతులపై లాఠీఛార్జ్​ చేయాలని సూచించిన పోలీసు అధికారి ఆయూష్​ సిన్హాను సస్పెండ్​ చేయాలని రైతులు డిమాండ్​ చేశారు.
    farmers protest
    బస్తాల్​ టోల్​ ప్లాజా వద్ద రైతులపై లాఠీఛార్జ్​
  • 2021, సెప్టెంబర్​ 5: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు దగ్గరపడుతుండటం వల్ల రైతుల నిరసనలతో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏకు సవాలుగా మారింది. దానిని అందిపుచ్చుకుని, తమ బలాన్ని పెంచుకునేందుకు రైతులు ముజఫర్​నగర్​లో మహాపంచాయత్​ నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు.
  • 2021, సెప్టెంబర్​ 7-9: కర్నాల్​కు భారీగా తరలివెళ్లిన రైతులు, మినీ సెక్రెటరియేట్​ను ముట్టడించారు. మృతి చెందిన రైతుకు రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వాలని, కర్నాల్​ ఎస్​డీఎం ఆయూష్​ సిన్హాపై క్రిమినల్​ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు.
  • 2021, సెప్టెంబర్​ 11: ఐదు రోజుల ఆందోళనలతో కర్నాల్​ యంత్రాంగం, హరియాణా ప్రభుత్వం దిగొచ్చి.. బస్తారా టోల్​ప్లాజా వద్ద జరిగిన లాఠీఛార్జ్​పై హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపడతామని హామీ ఇచ్చింది.
  • 2021, నవంబర్​ 19: సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో రైతులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
    farmers protest
    మిఠాయిలు పంచుతున్న రైతులు

ఇవీ చూడండి: కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు

Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

సత్యాగ్రహంతో రైతులు సాధించిన విజయం : రాహుల్ గాంధీ

అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయి: టికాయిత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.