కర్ణాటక కెంచనహల్లీ బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా సుమో- కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. మరణించిన వారు కోలార్ జిల్లా ములబగిలు మండలానికి చెందిన సునీల్ కుమార్, ప్రదీప్ కుమార్, నవీన్ కుమార్, చంద్రశేఖర్‌లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను హసన్‌లోని ఆసుపత్రికి తరలించారు.
![A terrible accident in Hassan: 4 dead, 11 injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hsn-01-accident-av-7203289-hd_21022021081648_2102f_1613875608_167_2102newsroom_1613879340_571.jpg)
![A terrible accident in Hassan: 4 dead, 11 injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hsn-01-accident-av-7203289-hd_21022021081648_2102f_1613875608_140_2102newsroom_1613879340_686.jpg)
కోలార్ జిల్లా ములబగిలు మండలానికి చెందిన వీళ్లు.. ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు నిర్ధరించారు పోలీసులు. హైవే పక్కన నిర్మించిన అక్రమ నిర్మాణమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. హసన్ ఎస్పీ, ట్రాఫిక్ పోలీస్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : రవాణా సౌకర్యం లేక డోలీపై 13 కి.మీ..