ETV Bharat / bharat

ఎడమచేతితో భోజనం చేసిందని.. పెళ్లి జరిగిన క్షణాలకే భార్యను..

Groom reject the bride: పెళ్లి చేసుకున్న క్షణాలకే ఆ నవ వధువు తనకు వద్దంటూ.. వదిలేశాడు పెళ్లి కొడుకు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ అసలేం జరిగింది?

Groom reject the bride for eating in the left hand
వీడెవడండీ బాబూ.. ఎడమచేతితో భోజనం చేసిందని భార్యను వదిలేశాడు
author img

By

Published : Mar 11, 2022, 10:11 PM IST

Groom reject the bride: వివాహ బంధంతో ఒక్కటైన జంటలు మనస్పర్ధలతోనో లేక ఇతర కారణాలతో విడిపోవడం గురించి విన్నాం. కానీ కర్ణాటకలోని దండేలీలో వరుడు ఓ వింత కారణాన్ని సాకుగా చెప్పి.. ఆ నవ వధువు తనకు వద్దంటూ హంగామా చేశాడు. పెళ్లి అయిన కొద్ది క్షణాలకే ఇదంతా జరగడం గమనార్హం.

ఇదీ జరిగింది..

జోయిడాకు చెందిన కబీర్​ కతు నాయక్​, యల్లాపురకు చెందిన వధువును దక్షిణ కన్నడ జిల్లాలోని కూలగీ ప్రాంతంలో బుధువారం వివాహం చేసుకున్నాడు. స్థానిక ఆలయంలో బంధువుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిగింది. అనంతరం అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. అసలు గొడవకు కారణమంతా ఇక్కడే ప్రారంభమైంది. వధువు ఎడమ చేతితో భోజనం చేసింది. అది చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. ఆమె వద్దంటూ గొడవకు దిగాడు. ఆమెకు వైకల్యం ఉందని.. అందుకే ఆ చేతితో భోజనం చేసిందని పెళ్లికూతురు తరఫువారు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు.

దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పెళ్లికొడుకుకు కౌన్సిలింగ్​ ఇచ్చారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై 'రివెంజ్​'.. హత్య కేసు నిందితుడిని ఆరుగురు కలిసి పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.