ETV Bharat / bharat

రైతు సూపర్ ఐడియా.. రూ.14తోనే 100కి.మీ ప్రయాణం​ - నాందేడ్ రైతు విద్యుత్​ బైక్

ఆ రైతు చదివింది పదో తరగతి.. నైపుణ్యం మాత్రం ఇంజినీర్​కు ఉన్నంత ఉంది. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చంటే ఈ రోజుల్లో ఎంత చౌకో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో రెండు సంవత్సరాలు కష్టపడి విద్యుత్​ బైకును తయారుచేశాడు ఈ రైతు. రోజు రూ.250 ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచనతో దీన్ని రూపొందించాడు. ఈ బైక్​ ప్రత్యేకతలు చూద్దాం..

nanded farmer
నాందేడ్​ రైతు
author img

By

Published : Feb 17, 2022, 1:26 PM IST

Updated : Feb 17, 2022, 3:48 PM IST

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాకు చెందిన ధ్యానేశ్వర్ ఉమాజీరావ్​ కల్యాంకర్ అనే 30 ఏళ్ల రైతు విద్యుత్​ బైక్​ను రూపొందించాడు. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేలా దీన్ని తయారు చేశాడు. పింపలగాన్ మహాదేవ్​ సమీపంలోని అర్థాపుర్​ గ్రామానికి చెందిన ఈ రైతు.. తనకున్న కొద్దిపాటి భూమిలోనే సోదరునితో కలిసి వివిధ రకాల పూల మెుక్కలు సాగు చేస్తాడు. వీటిని మార్కెట్​కి రవాణా చేయడానికి రోజుకు రూ.250 ఖర్చు అయ్యేది. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్న ఆలోచన చేసి ఎలక్ట్రిక్ బైక్​ను తీర్చిదిద్దాడు.

dyaneswar
ధ్యానేశ్వర్​

లాక్​డౌన్​ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి ఈ విద్యుత్​ బైకును తయారుచేశాడు ధ్యానేశ్వర్​. దీనిపై సుమారు 300 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీకి రూ.26,000 అవుతుంది. 750 వోల్ట్ కెపాసిటీ గల మోటార్​, 48 వోల్ట్​ బ్యాటరీ, ఛార్జర్​, కంట్రోలర్, లైట్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఉంటాయి. కేవలం 4 గంటలు ఛార్జింగ్​ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి రూ.14 మాత్రమే ఖర్చు అవుతుంది.

విద్యుత్​ బైక్​ తయారీకి మొత్తం రూ.40,000 ఖర్చు అయినట్లు ధ్యానేశ్వర్​ చెప్పాడు. ఈ బైక్​ను చూసేందుకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివెళ్తున్నారు.

electric bike
విద్యుత్​ బైక్​తో ధ్యానేశ్వర్​

తానొక చిన్న రైతునని .. డబ్బులు లేకపోవడం వల్ల మరిన్ని ప్రయోగాలు చేయలేకపోతున్నానని ధ్యానేశ్వర్​ అన్నాడు. ఎవరైనా సాయం చేస్తే గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేస్తానని చెబుతున్నాడు.

ఇదీ చదవండి: దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. మరోసారి 30 వేలకు పైనే..

Last Updated : Feb 17, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.