ETV Bharat / bharat

సూసైడ్​ చేసుకుంటానని కొండ ఎక్కిన యువతి.. ఎస్ఐ ఎంట్రీతో.. - kerala news

ఆత్మహత్య చేసుకుందామని కొండ ఎక్కిన ఓ యువతికి పోలీసు నచ్చజెప్పాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుంది. ఈ సంఘటన కేరళలోని ఇడుక్కిలో జరిగింది.

police rescue suicidal girl
police rescue suicidal girl
author img

By

Published : Jun 9, 2022, 7:17 PM IST

కొండ ఎక్కి యువతి ఆత్మహత్యాయత్నం.. విరమింపజేసిన ఎస్ఐ

Police rescue suicidal girl: ఆత్మహత్య చేసుకుందామని కొండ ఎక్కిన ఓ యువతికి నచ్చజెప్పి దిగేలా చేశారు కేరళకు చెందిన పోలీసు. ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుస్తానని హామీ ఇచ్చారు. అడిమాలీకి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుని కొండ ఎక్కింది. దీనిని చూసిన స్థానికులు.. ఆమెను సముదాయించేందుకు యత్నించారు. అయినా ఆమె వినకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న అడిమాలీ పోలీస్​ స్టేషన్​ ఎస్​ఐ సంతోష్​ మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. వాటిని అవసరమైతే తానే తీరుస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నాన్ని మానుకొని కొండ దిగింది. ఎస్​ఐ సంతోష్​ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి: చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.