ETV Bharat / bharat

20ఏళ్ల క్రితం సమాధి కట్టుకొని.. రూ.లక్ష కూడబెట్టి.. ఆత్మాభిమానంతో మృతి - సమాధి నిర్మించుకున్న వృద్ధుడు

తాను మరణించిన తర్వాత ఎవరికీ సమస్యగా మారకూడదు అనుకున్నాడు ఓ వృద్ధుడు. అందుకే మరణించకముందే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. అంత్యక్రియలకు కావాల్సిన నగదును సైతం సమకూర్చుకున్నాడు. చివరికి ఆత్మాభిమానంతో తనువు చాలించాడు. ఆ వృద్ధుడు ఎవరు? ఈ కథ ఎక్కడ జరిగింది? పదండి తెలుసుకుందాం..!

A person who had built his own tomb
వృద్ధుడు నిర్మించుకున్న సమాధి
author img

By

Published : Jul 26, 2022, 5:30 AM IST

సాధారణంగా ఓ వ్యక్తి మరణించిన తర్వాత సమాధి కడతారు. అదీ వారి కటుంబ సభ్యులో, బంధువులో నిర్మిస్తారు. కానీ ఓ వ్యక్తి తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. మరణించిన తర్వాత ఎవరికీ సమస్యగా మారకూడదని.. అంత్యక్రియలకు అవసరమైన నగదును కూడా సమకూర్చుకున్నాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని చామరాజనగర్​లో జరిగింది. నంజదేవనపుర గ్రామానికి చెందిన పుట్టమల్లప్ప అనే వృద్ధుడు 20 ఏళ్ల క్రితమే తనకు నచ్చినట్లుగా సమాధిని నిర్మించుకున్నాడు. దీంతో పాటు అంత్యక్రియలకు అవసరమవుతాయని సుమారు లక్ష రూపాయలను దాచుకున్నాడు.

A person who had built his own tomb
వృద్ధుడు నిర్మించుకున్న సమాధి
man built his own tomb
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ
man built his own tomb
సమాధికి రంగులు వేస్తూ

ధనవంతుడైన పుట్టమల్లప్పకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తన సొంత డబ్బుతోనే అంత్యక్రియలు చేయాలనే ఉద్దేశంతోనే సమాధి నిర్మించుకున్నాడు. ఎవరి డబ్బుతో తన అంత్యక్రియలు జరగకూడదనే ఆత్మగౌరవంతోనే ఆయన ఇలా చేశాడని కుటుంబ సభ్యులు చెప్పారు. గతేడాది కరోనాతో పుట్టమల్లప్ప భార్య మరణించగా.. ఆమె అంత్యక్రియలు సైతం కుమారుల వద్ద నుంచి డబ్బులు తీసుకోకుండానే నిర్వహించాడు. గత 12 రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. 5 రోజుల క్రితం పూర్తిగా మాట్లాడటం ఆపేసినట్లు ఆయన కుమారుడు చెప్పాడు. ఆదివారం సాయంత్రం పుట్టమల్లప్ప మరణించాడు. దీంతో పుట్టమల్లప్ప కోరిక మేరకు ఆయన డబ్బులతోనే అంత్యక్రియలు నిర్వహించారు కుమారులు.

ఇవీ చదవండి: కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి.. పదిమందికి అస్వస్థత

ఏడేళ్ల తర్వాత గర్భం.. ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. సంబరపడేలోపే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.