ETV Bharat / bharat

గోశాల కోసం నాలుగున్నర ఎకరాల విరాళం.. ముస్లిం దాతృత్వం - గోశాల కోసం ముస్లిం వ్యక్తి భూమి దానం

కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గోశాల కోసం ఏకంగా తన రూ.2 కోట్లు విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చేశాడు.

A muslim donated land for goshala
A muslim donated land for goshala
author img

By

Published : Oct 6, 2022, 4:57 PM IST

అంగుళం భూమి కోసం అన్నదమ్ముల మధ్యే గొడవలు తలెత్తుతున్న ఈ రోజుల్లో.. కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించాలనే కోరిక కూడా తనకు ఉందని అన్నాడు ఆ వ్యక్తి.

మహ్మద్ నజీర్.. కాఫీ గింజల వ్యాపారం చేస్తున్నాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం దానం చేశాడు. గోశాలతో పాటు అందులో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టనున్నారు. కాడూరు-మంగళూరు జాతీయ రహదారి-173 పక్కనున్న ఆ భూమి విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ భూమిని చిక్కమగళూరుకు చెందిన స్వామి సమర్థ్ రామదాస ట్రస్ట్​కు దానంగా ఇచ్చాడు.

'నా తల్లికి క్యాన్సర్ ఉంది​. అమెకు ఓసారి గోమూత్రం తాగించాను. దీంతో క్యాన్సర్​ వ్యాధి నయమైంది. అయితే ఆ గోమాత రుణం ఎలాగైన తీర్చుకోవాలనుకున్నాను. వాటికి ఎంతో కొంత సహాయం చేయాలని నా నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం ఇచ్చాను. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను' అని నజీర్ తెలిపాడు.

అయితే ఆ భూమి ట్రస్ట్​ పేరు మీద ఇప్పటికే​ రిజిస్టర్ అయ్యింది. త్వరలోనే అక్కడ గోశాల, అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, గురుకులం, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభం కానున్నాయి. నజీర్ ఈ చేసిన ఈ పని మతాల మధ్య సామరస్యం పెరిగేందుకు దోహదం చేస్తుంది పలువురు అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి: యాక్సిడెంట్​లో 33మంది మృతి.. ఆ పాప మాత్రం సేఫ్.. చనిపోయిన తల్లి గుండెను 12గంటలు హత్తుకుని..

ఒకేసారి 108 మంది వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.