ETV Bharat / bharat

బాలికపై బంధువే అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య - అత్యాచారం

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో.. అవమానం తట్టుకోలేక ఓ 17 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. బాలికపై బంధువే అత్యాచారం చేయగా.. గర్భం దాల్చినట్లు అందరికీ తెలియడం వల్ల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

minor victim committed suicide
అవమానంతో బాలిక బలవన్మరణం
author img

By

Published : Sep 11, 2021, 6:58 PM IST

మహారాష్ట్రలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. అవమానం తట్టుకోలేక 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. అమరావతి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏం జరిగింది?

బాలిక కుటుంబానికి బంధువైన ఒక వ్యక్తి తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. ఏడు నెలల గర్భిణి అయిన ఆ బాలిక విషయం కుటుంబసభ్యులతో పాటు బయట కూడా తెలియడం వల్ల అవమానం భరించలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈనెల 15 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చూడండి: 33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన అత్యాచార బాధితురాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.