ETV Bharat / bharat

కుప్పకూలిన మిగ్​-29కే యుద్ధ విమానం.. లక్కీగా... - MiG 29K crash news

గోవా తీరంలో నావికా దళానికి చెందిన మిగ్​-29 కే యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.

MiG 29K fighter aircraft crashed over sea

author img

By

Published : Oct 12, 2022, 11:38 AM IST

Updated : Oct 12, 2022, 1:45 PM IST

MIG 29K Crash Goa: సాధారణ సార్టీల్లో భాగంగా గాల్లోకి ఎగిరి తిరిగి స్థావరానికి వస్తుండగా.. మిగ్​-29కే యుద్ధ విమానం బుధవారం గోవా తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఇండియన్​ నేవీ అధికారులు తెలిపారు. అయితే రెస్క్యూ ఆపరేషన్​ ద్వారా పైలట్​ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ(బీఓఐ) ఆదేశించిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు.

2019 నుంచి మిగ్‌-29కే విమానం కూలడం ఇది నాలుగోసారి. ఈ విమానంలో రష్యాలో తయారు చేసిన కే-36డీ-3.5 ఎజెక్షన్‌ సీట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటిని అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు.

  • 2020 నవంబర్‌లో మిగ్‌-29కే విమానం కూలి ఒక పైలట్‌ మరణించగా.. మరో పైలట్‌ను కాపాడారు. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాత గానీ మరణించిన పైలట్‌ నిషాంత్‌ సింగ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు.
  • ఇక 2020 ఫిబ్రవరిలో మిగ్‌-29కేను పక్షి ఢీకొంది. దీంతో పైలట్లు శ్రమించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి ఎజెక్ట్‌ అయ్యారు.
  • 2019లో గోవాలోని ఓ గ్రామ శివారులో నావికాదళానికి చెందిన మిగ్‌ 29కే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి పైలట్లు సరక్షితంగా బయటపడ్డారు.

ఇవీ చదవండి: కరెంట్​ స్తంభానికి షర్ట్​తో ఉరేసి యువకుడు హత్య.. వారి ఆగడాలు బయటపెట్టినందుకే!

ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి!

Last Updated : Oct 12, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.