మహారాష్ట్ర ఉస్మానాబాద్ (Osmanabad Meteor) జిల్లాలోని వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. (Meteor fall in India) దీన్ని అంతరిక్షంలోని ఉల్కగా భావిస్తున్నారు.
ఈ ప్రాంతానికి చెందిన రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం పొలం పనులు చేసుకుంటుండగా ఇది నేలపై పడింది. ఉదయం 6.30 గంటలకు ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ప్రభుకు.. ఏడెనిమిది ఫీట్ల దూరంలో పడిపోయింది. (Meteor fall in India)
వెంటనే తహసీద్లాద్ర నర్సింగ్ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కిలోగ్రాములు ఉన్నట్లు గుర్తించారు.
విలువపై అంచనా..
తహసీల్దార్ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత.. ఈ రాయిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు పంపించారు. ఇది ఉల్క అయి ఉండొచ్చని భావిస్తున్నారు. రాయి 3.5 అంగుళాల మందంతో ఉందని తెలిపారు. దీనిపై మరింత పరిశోధన కొనసాగుతోంది. దీని విలువపై అంచనాకు వస్తున్నారు.
ఇక ఈ వ్యవహారం ఉస్మానాబాద్‌లో (Osmanabad Meteor) చర్చనీయాంశంగా మారింది. రంగును బట్టి కొందరు దీన్ని బంగారు శిలగా అభివర్ణిస్తున్నారు.
ఇదీ చదవండి: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం