A Person Suicide Extramarital Affair at Secunderabad : నేటి కాలంలో వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ.
నా భర్తని చంపెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..
Extramarital Affair with Sister in Law : తాజాగా మానవ సంబధాలకే మచ్చ తెచ్చేలా ఓ వ్యక్తి.. అన్న భార్యతో వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగిస్తున్నాడు. మరోవైపు అతడు సోదరుడిని వదలి.. తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. కానీ ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ చోటుచోసుకుంది. అందుకు సదరు మహిళ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలో జరిగింది.
బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరియాణాకు చెందిన శివకుమార్, రీతూలు భార్యాభర్తలు. ఉపాధినిమిత్తం నగరానికి వలసవచ్చారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోదరుడు శివ భార్య రీతూతో.. తమ్ముడు ప్రదీప్‌కుమార్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఫేస్బుక్ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్ చేస్తే..
అన్నయ్య శివను వదిలి తనను వివాహం చేసుకోవాలని.. రీతూపై ప్రదీప్‌కుమార్ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపానికి గురైన ప్రదీప్.. గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని (Commits Suicide at Hyderabad)ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇటీవలే సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతను సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. అక్కడే ఓ వివాహితతో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉండటం అభిషేక్ గమనించాడు. ఇది సహించలేక మానసికంగా కుంగిపోయాడు.
ఈ క్రమంలోనే అభిషేక్ ఇంటికి వచ్చేశాడు. పొలం వద్ద ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.